అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ రేసు నుంచి తప్పుకోనున్నారా.. ఈ వీకెండ్‌లో కీలక ప్రకటన..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్( Joe Biden ) తప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.ట్రంప్‌( Donald Trump )తో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో తడబడటంతో పాటు వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడం, అనారోగ్యం కారణంగా బైడెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Us President Joe Biden Expected To Make Major Announcement About His Re-election-TeluguStop.com

ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవాల్సిందిగా రిపబ్లికన్లతో పాటు సొంత పార్టీ నేతలు బైడెన్‌‌ను డిమాండ్ చేస్తున్నారు.స్వయంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా( Barack Obama ) సైతం.

బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై పునరాలోచించుకోవాలని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట.అలాగే సీనియర్ డెమొక్రాట్, మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అయితే ఏకంగా బైడెన్‌కే ఫోన్ చేసి తప్పుకోమని చెప్పినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Telugu Barack Obama, Covid, Donald Trump, Joe Biden, Kamala Harris, Las Vegas, N

ఈ పరిణామాల నేపథ్యంలో తన అభ్యర్ధిత్వం, విజయావకాశాలపై బైడెన్( Joe Biden ) సమీక్షించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఈ వీకెండ్‌లో తన పోటీపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.డెమొక్రాట్ల నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.బైడెన్ కనుక అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకుంటే , ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్‌( Kamala Harris )ను డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.

Telugu Barack Obama, Covid, Donald Trump, Joe Biden, Kamala Harris, Las Vegas, N

ఇదిలావుండగా .జో బైడెన్‌ కరోనా( Covid ) బారినపడిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.బైడెన్ స్వల్పంగా దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని.ప్రస్తుతం ఆయన తన స్వస్థలం డెలావేర్‌లోని నివాసంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది.అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్‌లో ప్రచారంలో పాల్గొన్నారు బైడెన్.

ఈ క్రమంలో వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో యునిడోస్ నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగి వెంటనే ఇంటికి చేరుకున్నారు.ప్రస్తుతం బైడెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అధ్యక్షుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తారని శ్వేతసౌధం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube