తెలుగు వారిగా పుట్టి తప్పు చేశామా అని అనిపించే నటీనటులు వీరే !

టాలెంట్ ఎంత ఉన్నావ్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వారికి అవకాశాలు రావు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ ఒక్క శాతం కూడా ఉండడం లేదు.

 Tollywood Actors With Loads Of Talent ,satyadev , Tollywood Actors , Eesha Re-TeluguStop.com

అందుకు అనేక కారణాలు ఉండొచ్చు.కానీ ఎంతో టాలెంట్ ఉంది అంతకన్నా అద్భుతంగా నటించగలిగే వారిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఇండస్ట్రీకి ఉంటుంది.

అయితే ఆ పరిస్థితులు ఇప్పటి తరంలో అయితే లేవు.కానీ కొన్నాళ్ల క్రితం పూర్తిగా తెలుగు నటినటులతోనే ఇండస్ట్రీ ఉండేది మరి ఆ రోజులు రావాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు అందుకే తెలుగులో పుట్టి తప్పు చేసామా అని అనిపించే పరిస్థితులు వచ్చాయి.

అలా ఎంతో టాలెంట్ ఉంది తెలుగు సినిమా పరిశ్రమలో ఎదగలేకపోతున్న ఆ నటినటులు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Eesha Rebba, Kishore, Satyadev, Shafi-Movie

తెలుగులో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న చాలామంది హీరోలకు అన్న కూడా హీరో సత్యదేవ్( Satyadev ) ఎంతో మెరుగైన నటుడు అంతే అద్భుతంగా నటించగలడు అయినా కూడా ఆయనకు అవకాశాలు రావడం లేదు పైగా ఇక్కడే ఉంటే మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ గానే మిగిలిపోతాడు.ఒకవేళ బాలీవుడ్ లో ట్రై చేస్తే ఖచ్చితంగా మంచి నటుడవగలడు.ఇక టాలెంటెడ్ హీరోయిన్ అయినా ఇషా రెబ్బ ( Eesha Rebba )సైతం ఎంతో బాగా నటించగలిగినా కూడా ఆమెకు తెలుగు వారు ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు అందుకే తమిళ్ లో ట్రై చేస్తుంది.

నటుడు షఫీ( Shafi ) సైతం తెలుగులో పుట్టడం వల్లే గొప్ప స్టార్ అవలేకపోతున్నాడు అని చెప్పొచ్చు.ఎందుకంటే అంతకన్నా నటించే చాలామందికి ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి కానీ షఫీ ఇలాంటి ఒక అద్భుత నటుడిని ఇండస్ట్రీ సరిగా వాడుకోవడం లేదు.

Telugu Eesha Rebba, Kishore, Satyadev, Shafi-Movie

కంచరపాలెం సినిమాలో నటించిన కిషోర్ సైతం మీ అందరికీ గుర్తుండే ఉంటాడు ఇతడు తెలుగులో సరిగా క్లిక్ అవ్వలేకపోతున్నాడు.కానీ అతడిని ఇండస్ట్రీ వాడుకుంటే గొప్ప నటుడు అవ్వ గలడు ఇలా వీరు మాత్రమే కాదు బయట వారు ఎక్కువగా ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఆ తెలుగువారికి అవకాశాలు రావడం లేదు టాలెంట్ కచ్చితంగా తొక్కేయపడుతుంది.నటుడు కోట శ్రీనివాసరావు ఎన్నోసార్లు ఈ విషయం చెబుతూ వచ్చారు.ఈ మాత్రం నటన మన తెలుగు వారు చేయరా ?బాలీవుడ్ నుంచి దింపాల అంటూ ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశాడు కానీ వినేవారు ఎవరు చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube