ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ బ్యూటీ.. మన దేశ సాంప్రదాయం పాటిస్తూ?

హాలీవుడ్ భామలు కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ ( Kim Kardashian, Khloe Kardashian )ల గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల ఈ ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 Kim Kardashian Visits Iskcon Temple In Mumbai And Offers Annadanam To Childrens,-TeluguStop.com

కాగా తాజాగా అంబానీ ఇంటి జరిగిన పెళ్లి వేడుకకు ఇద్దరు ముద్దుగుమ్మలు హాజరైన విషయం తెలిసిందే.అంతేకాకుండా గత మూడు నాలుగు రోజులుగా ఇద్దరు హాలీవుడ్ భామలు ఇండియాలోనే ఉంటున్నారు.

ఇక అనంత అంబానీ పెళ్లిలో వీరిద్దరూ సందడి సందడి చేసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ ఇద్దరు హాలీవుడ్ భామలు ఒక మంచి పనిచేసారు.

దాంతో ప్రతి ఒక్కరు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ తాజాగా ముంబై లోని ఇస్కాన్ టెంపుల్ ని దర్శించారు.అక్కడ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ తరువాత ఇస్కాన్( ISKCON ) చేసే అన్నదానంలో పాల్గొన్నారు.అక్కడ పిల్లలకు వారే స్వయంగా వడ్డించారు.ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనపడే ఈ హాలీవుడ్ భామలు టెంపుల్ లో పద్దతిగా కనిపించారు.

దీంతో ఈ హాలీవుడ్ భామల పూజలు, అన్నదానం ఫోటోలు వైరల్ గా మారాయి.ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం, పూజలు చేసిన ఫోటోలను కిమ్ కర్దాషియన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి టెంపుల్ లో ఇంత మంచి అనుభూతిని ఇచ్చినందుకు, ఆ చిన్న పిల్లని కలిసేలా చేసినందుకు థ్యాంక్యూ అని వీళ్ళని అక్కడికి తీసుకెళ్లిన వాళ్ళని ట్యాగ్ చేశారు.

దీంతో నెటిజన్స్ హాలీవుడ్ హీరోయిన్ అయినా ఇండియన్ కల్చర్ ని గౌరవించి, ఇక్కడ టెంపుల్ ని దర్శించి సేవా కార్యక్రమాల్లో పాల్గొంది అంటూ కిమ్ ని అభినందిస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube