వ్యాన్‌లో లైఫ్ గడపాలని నిర్ణయించుకున్న న్యూజిలాండ్ మహిళ.. ఎందుకో తెలిస్తే..??

చాలా మంది సొంత ఇల్లు కొని, అక్కడే ప్రశాంతంగా జీవించాలనే కోరిక ఉంటుంది.కానీ, యువతకు ఇల్లు కొనడం చాలా కష్టం.

 If You Know Why The New Zealand Woman Decided To Spend Her Life In A Van, Carava-TeluguStop.com

ఎందుకంటే, వారికి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది, అధిక వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుంది.అద్దె కూడా చాలా ఎక్కువగా ఉంది.

దీంతో, చాలా మంది ఇల్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.కానీ, న్యూజిలాండ్‌కు( New Zealand ) చెందిన కరెన్ మాత్రం రుణాలు చెల్లించడానికి బదులు, ఒక కారవాన్‌లో నివసించాలని నిర్ణయించుకుంది.

ఈ ధోరణి విదేశాలలో చాలా వరకు పాపులర్ అవుతోంది.

ఇల్లు కొనడానికి సరిపోయేంత డబ్బు లేకపోవడంతో కరెన్ కారవాన్‌లో పూర్తిస్థాయిలో నివసించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

గ్రాఫిక్ డిజైనర్‌గా ( graphic designer )పనిచేసే కరెన్ గత మూడేళ్లుగా తన కారవాన్‌లో దేశమంతా తిరుగుతూ ఉంది.రుణాలు చెల్లించాల్సిన బాధ లేకపోవడం, కొత్త ప్రదేశాలను చూడగలగడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది.

ఇక్కడ కారవాన్‌ అంటే కారు, వ్యాన్‌ సౌకర్యాలు కలిగినది.

Telugu Afdable, Caravan, Zealanddecided, Karen, Zealand, Van-Telugu NRI

కరెన్ చాలా డబ్బు ఆదా చేసుకుంది.ఇల్లు అద్దెకు ఉంటే ఖర్చు అయ్యే డబ్బు మొత్తం ఆమె దగ్గరే ఉంది.అందుకే, ఆమె దేశమంతా తిరగగలిగింది.

ఆమె కారవాన్ పొడవు కేవలం 21 అడుగులు మాత్రమే.ఇంటి స్థలం చాలా తక్కువ కావడం ఇందులోని ప్రధాన సమస్య.

ఈ సమస్యను అధిగమించడానికి ఆమె కారవాన్ ( Caravan )లోపల స్థలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించింది.అదనపు అల్మారాలు, మడతపెట్టే వస్తువుల నిల్వ స్థలాలను ఏర్పాటు చేసింది.

Telugu Afdable, Caravan, Zealanddecided, Karen, Zealand, Van-Telugu NRI

కరెన్ ఒక గ్రాఫిక్ డిజైనర్.ఇంటి నుంచే పని చేయడం వల్ల ఆమె సమయం ఆదా అవుతుంది.ఖాళీ సమయంలో ప్రయాణం చేస్తుంది.ఆమె కారవాన్‌కు పైకప్పుపై సోలార్ ప్యానెల్ ఉంది.క్యాంప్‌సైట్‌లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కోసం హుక్-అప్ ఉపయోగిస్తుంది.ఆమె ఉండే క్యాంప్‌సైట్లకు డబ్బు చెల్లించాలి.

కానీ అది ఇంటి అద్దె కంటే చాలా తక్కువ.కారవాన్ ఇన్సూరెన్స్, ఇంటి నుంచి పనిచేయడానికి ఇంటర్నెట్ మోడెం కోసం కూడా డబ్బు చెల్లించాలి.

కారవాన్‌ను లాగడానికి చాలా పెట్రోల్ ఖర్చు అవుతుంది.ఇది మరో సమస్య.

అయితే, ఇవన్నీ కలిపినా ఇంటి అద్దె కంటే తక్కువ ఖర్చు అవుతుందని ఆమె చెబుతుంది.కారవాన్‌లో డబుల్ గ్లేజ్డ్ విండోలు, గ్యాస్ హీటర్ ఉన్నాయి.

శీతాకాలంలో వెచ్చగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube