నేడు ఏపీ క్యాబినెట్ భేటీ ... వీటిపై క్లారిటీ 

ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )అధ్యక్షతన ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఒక క్లారిటీకి రానున్నారు.

 Ap Cabinet Meeting Today ... Clarity On These, Ap Cm Chandra Babu Naidu , Thalli-TeluguStop.com

ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు,  వాటి అమలు విధానాలపైన ప్రధానంగా చర్చించనున్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని నిలబెట్టుకోవడం, మెగా డీఎస్సీ( AP Mega DSC )పై తొలి సంతకం చేసి 16,500 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించడం ,ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తేవడం వంటివి తమ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని , మిగతా హామీలను కూడా సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో మరింత ఆదరణ పెంచుకోవాలనే అంశాల పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  ఏపీలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం వల్ల నిర్మాణ రంగం ఊపందుకుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి.  భవన నిర్మాణ కార్మికులకు పని దొరికిందని భావిస్తోంది.

Telugu Ap, Janasena-Politics

 ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.  ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు .అలాగే మహిళలు,  పేదలు , నిరుద్యోగులే లక్ష్యంగా ఇచ్చిన హామీల అమలుపైన క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు.ఇక గత కొద్ది రోజులుగా తల్లికి వందనం కార్యక్రమం పై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో,  దీనిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని,  వైసిపి( YCP ) చేస్తున్న విమర్శలకు పెట్టే విధంగా వివిధ విధానాలను ప్రకటించాలని ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  తల్లికి వందనం( Thalliki Vandanam ) పథకం త్వరలోనే అమలు చేస్తాం కార్యక్రమాన్ని కూడా వీలైనంత తొందరగా అమలు చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.ఇప్పటికే విధివిధానాలు ఖరారైన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఈ క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Telugu Ap, Janasena-Politics

విద్యార్థుల తల్లులు తమ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకుంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను నిరోధించవచ్చని,  ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం భావిస్తుంది.  పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.  తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపితే 75% హాజరు ఉంటే తల్లికి వందనం పథకానికి అర్హులవుతారని చెబుతున్నారు.నేటి క్యాబినెట్ సమావేశంలో వేటిపైనే ప్రధానంగా చర్చించి మార్గదర్శకాలను విడుదల చేయనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube