సాధారణంగా చాలా మందికి శరీరం మొత్తం తెల్లగా మృదువుగా మెరిసిపోతున్నా.మోచేతులు మాత్రం నల్లగా కఠినంగా కనిపిస్తుంటాయి.
డార్క్ నెస్ కారణంగా మోచేతులు చాలా అసహ్యంగా ఉంటాయి.ఈ క్రమంలోనే మోచేతుల నలుపు( Dark Elbows )ను వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే కొందరిలో ఎన్ని చేసినా కూడా మోచేతుల నలుపు ఓ పట్టాన పోదు.అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని ట్రై చేస్తే కొద్ది రోజుల్లోనే మోచేతులు నలుపు మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక టమాటో( Tomato )ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ ఫ్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై పది నిమిషాల పాటు మోచేతులను ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.టమాటో మరియు లెమన్ జ్యూస్ లో ఉండే బ్లీచింగ్ ప్రాపర్టీస్ మోచేతుల వద్ద నలుపును క్రమంగా మాయం చేస్తాయి.అలాగే అలోవెరా జెల్, రోజ్ వాటర్ మోచేతులను మృదువుగా మారుస్తాయి.
అందంగా మెరిపిస్తాయి.మోచేతులు ఎంత నల్లగా ఉన్నా సరే రెగ్యులర్ గా ఈ హోమ్ రెమెడీని పాటించారంటే కొద్ది రోజుల్లోనే తెల్లగా, మృదువుగా మరియు కాంతివంతంగా మారుతాయి.
కాబట్టి నల్లటి మోచేతులు ఉన్నవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.