వయసు పై పడే కొద్ది శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.ముఖంలో మునుపటి మెరుపు అస్సలు కనిపించదు.30 ఏళ్లకే ముడతలు, చారలు, చర్మం సాగటం( Aging Problems ) వంటివి తలెత్తుతాయి.ముఖ్యంగా మహిళలు ఈ సమస్యలను అధికంగా ఫేస్ చేస్తూ ఉంటారు.
ప్రెగ్నెన్సీ, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటినిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.దీంతో ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడల్లా లోలోన తెగ మదన పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ప్రయత్నించాల్సిందే.ఈ రెమెడీ మీ చర్మాన్ని ముప్పైలోనూ యవ్వనంగా( Youthful Skin ) మెరిపిస్తుంది.కాంతివంతంగా మారుస్తుంది.మరి ఇంతకీ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ ను బ్రేక్ చేసి వైట్ ను మాత్రం వేసుకోవాలి.
ఈ ఎగ్ వైట్ లో రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని మూడు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ఒకటికి రెండుసార్లు ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే పాలు, తేనె, ఎగ్ వైట్( Egg White ) లో ఉండే పలు పోషకాలు ముడతలు, చారలను మాయం చేస్తాయి.
సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.

ముఖంలో మునుపటి మెరుపును తీసుకొస్తాయి.ముప్పైలోనూ ముఖ చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.పైగా ఈ రెమెడీ వల్ల డ్రై స్కిన్ సమస్య( Dry Skin )కు దూరంగా ఉండవచ్చు.
గుడ్డు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.పాలు వల్ల స్కిన్ మృదువుగా కోమలంగా మారుతుంది.
మరియు తేనె చర్మాన్ని ఎల్లప్పుడూ గ్లోయింగ్ గా షైనీగా కనిపించేలా చేస్తుంది.