టాలీవుడ్ ఇండస్ట్రీలోని( Tollywood industry ) స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల (Srileela)జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.గత ఐదేళ్లలో తెలుగులో శ్రీలీల స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్లు దాదాపుగా లేదనే చెప్పాలి.
అయితే శ్రీలీల కంటే ముందే సినిమాల్లోకి వచ్చిన నిధి అగర్వాల్( Nidhi Agarwal ) చేతిలో మాత్రం ఆ స్థాయిలో ఆఫర్లు అయితే లేవనే సంగతి తెలిసిందే.
అయితే శ్రీలీలతో పోలుస్తూ నెటిజన్ కామెంట్ చేయగా ఆ కామెంట్ నిధి అగర్వాల్ దృష్టికి రావడంతో ఆమె రియాక్ట్ అయ్యారు.
ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) తర్వాత నిధి ఎన్ని సినిమాలు చేసిందని శ్రీలీల ఎన్ని సినిమాలు చేసిందని నెటిజన్ కామెంట్ చేయగా ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేశానని తమిళంలో మూడు సినిమాలు చేశానని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ సినిమాల్లో సైతం ఆమె నటిస్తున్నారు.

నేను మంచి స్క్రిప్ట్స్ అనుకున్న వాటికి మాత్రమే ఓకే చెబుతున్నానని కొన్నిసార్లు నా నిర్ణయం తప్పు కావచ్చని నిధి అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ మంచి సినిమాల్లో మాత్రమే భాగం కావాలని నా ఒపీనియన్ అని ఆమె పేర్కొన్నారు.వరుసగా సినిమాలు చేయాలనే తొందర నాకు లేదని ఈ ఇండస్ట్రీలోనే నేను ఉండాలనుకుంటున్నానని ఆమె వెల్లడించడం గమనార్హం.

2017 సంవత్సరంలో నిధి అగర్వాల్ కెరీర్ మొదలైంది.మున్నా మైఖేల్ ( Munna Michael )అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా ఆమె కెరీర్ మొదలైంది.సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లో నిధి అడుగుపెట్టగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ దక్కింది.
తెలుగు, తమిళ భాషల్లోని సినిమాలతో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.