ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు కాఫీ, టీ( Coffee, tea )లు ఎక్కువగా తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.కాఫీ, టీలు చెడు అలవాట్లుగా కొంతమంది ప్రజలు భావిస్తున్నారు.
కనీసం కాఫీ అలవాటు కూడా లేదు అని ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడానికి గుర్తుగా చెబుతూ ఉంటారు.అయితే ఈ వాదాలన్నిటికీ తెరదించే రోజు త్వరలోనే రాబోతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.
అసలు కాఫీ ఎలా, ఎంత మోతాదులో తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.రోజుకు మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల అనారోగ్య ప్రమాదాలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతూ తెలుపుతున్నారు.
రక్తంలో ఎక్కువ స్థాయిలో కెఫిన్( Caffeine ) ఉన్నప్పుడు స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్( Diabetes ) ప్రమాదాలు తగ్గుతాయి.క్యాలరీలు లేని కెఫిన్ కలిగిన పానీయాలు బరువు తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తాయి.
కానీ ఈ విషయం గురించి మరింత వివరంగా పరిశోధన జరగాలని స్టాక్హోమ్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ సుసన్నా లారెన్స్( Dr.Susannah Lawrence ) చెబుతున్నారు.వారి పరిశోధనలలో కెఫిన్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలుసుకున్నారు.

ఇండిపెండెంట్ గా కొంతమంది నిపుణులు చేసిన అద్యానాలలో ఈ ఫలితాలకు బలాన్ని ఇచ్చే ఆధారాల్లో లభించాయని వెల్లడించారు.శరీరంలో కెఫిన్ జీవక్రియ రేటును మూడు నుంచి 11 శాతం వరకు పెంచుతుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి.ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, స్థూల కాయ సమస్యలు చాలా పెద్ద హెల్త్ బటన్ గా పరిగణిస్తున్నారు.
స్థూలకాయం, డయాబెటిస్ కు మూల కారణం కూడా అయ్యే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే బరువు తగ్గాలనే ఆలోచనతో కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫిన్ తో వచ్చే దుష్ప్రభావాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.కాఫీ వినియోగం పెరిగితే కొంత మందిలో నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.మరి కొంతమందిలో పాల్పిటేషన్లు కలిగించవచ్చు.
ఈ అధ్యనాన్ని అనుసరించి కాఫీ వినియోగం పెంచడం అంతా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.ఇక ముందు ఈ విషయం మీద జరిగే పరిశోధనలకు వారి అధ్యయనం మార్గదర్శకంగా ఉంటాయని వెల్లడించారు.







