జస్టిన్ ట్రూడో ( Justin Trudeau )ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు తీసుకుని రోజులు గడవకముందే కెనడాలో అప్పుడే ఎన్నికల నగారా మోగింది.ఏప్రిల్ 28న కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో లిబరల్స్, కన్జర్వేటివ్స్‌లలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
భారత సంతతికి చెందిన బిలియనీర్ ప్రేమ్ వాట్సా నేతృత్వంలోని దేశంలోని కార్పోరేట్ లీడర్స్ బృందం ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి మద్ధతు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కెనడాలోని ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రీ ఎంటర్‌ప్రైజ్ బ్యానర్( Friends of Free Enterprise banner ) కింద 30 మందికి పైగా కార్పోరేట్ లీడర్స్ ఓ బహిరంగ లేఖపై కన్జర్వేటివ్స్‌కు మద్ధతు ఇస్తూ సంతకం చేశారు.
ఇది ఈ వారాంతంలో కెనడియన్ పత్రికలలో ఇది ప్రచురితమైంది.కెనడాలో ఆర్ధిక క్షీణతను అరికట్టడానికి అవసరమైన నాలుగు సూత్రాలను వారు వివరించారు.అవి స్వేచ్ఛా సంస్థకు మద్ధతు ఇవ్వడం, అడ్డంకులను తొలగించడం, ఆర్ధిక క్రమశిక్షణను పునరుద్ధరించడం, పన్ను వ్యవస్ధను సంస్కరించడం ముఖ్యమైనవి.

ప్రస్తుతం చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని.అందుకే తాము పియరీ పోయిలివ్రే సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడాకు మద్ధతు ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి , కెనడాను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి వారికి స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు.
ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని.మనదేశం ఒక కూడలిలో ఉందని, మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే తరాలకు కెనడా భవిష్యత్తును రూపొందిస్తాయని పేర్కొంది.

ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఫెయిర్‌ఫ్యాక్స్ సీఈవో, ఛైర్మన్ వాట్సా( Fairfax CEO and Chairman Watsa ).రియల్ ఎస్టేట్ దిగ్గజం బాబ్ ధిల్లాన్.మెయిన్‌స్ట్రీట్ ఈక్విటీ కార్ప్ అధ్యక్షుడు , సీఈవో అమర్ వర్మ.మార్వెల్ క్యాపిటల్ లిమిటెడ్ సీఈవో, ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా ఛైర్మన్ బెన్ వాట్సా వున్నారు.ప్రేమ్ వాట్సాను కెనడా వారెన్ బఫెట్‌గా అక్కడి కార్పోరేట్ సమాజం అభివర్ణిస్తుంది.