ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan )భార్య అన్నా లెజినోవా గురించి సోషల్ మీడియ వేదికగా ప్రశంసలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.మార్క్ శంకర్ ( Mark Shankar )అగ్ని ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దంపతులు మొక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సందర్శనకు వెళ్లిన అన్నా లెజినోవా కొడుకు పేరుపై 17 లక్షల రూపాయలు భారీ విరాళం అందించారు.
ఈరోజు మధ్యాహ్నం అన్నదానం కోసం అయ్యే ఖర్చును ఆమె విరాళంగా అందజేశారు.
స్వామివారికి అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే.సంప్రదాయ వస్త్రధారణలో ఆమె ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీవారిపై విశ్వాసాన్ని చాటుతూ ఆమె డిక్లరేషన్ కూడా ఇవ్వడం గమనార్హం.ఆమె చేసిన పనులను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

ఎవరి మనోభావాలు హర్ట్ కాకుండా అన్నా లెజినోవా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు.ఆమెపై సామాన్యుల్లో సైతం గౌరవం పెరిగే విధంగా అన్నా లెజినోవా వ్యవహరించారు.అన్నా లెజినోవా గొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.పద్మావతి కళ్యాణ కట్టకు( Padmavati Kalyana Katta ) చేరుకున్న తర్వాత అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించి వార్తల్లో నిలిచారు.

అన్నా లెజినోవా ఈరోజు సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.అన్ని ఆలయ సాంప్రదాయాలను ఆమె పాటించారు.నిత్యాన్నదాన సత్రంలో అన్నా లెజినోవా స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించడం గమనార్హం.తిరుపతి పర్యటన తర్వాత అన్నా లెజినోవా రేణి గుంట విమానాశ్రయానికి బయలుదేరారు.అన్నా లెజినోవా రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను సైతం సందర్శించుకుంటారేమో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పలు సినిమాలను ఎప్పటికి పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది.
ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.