టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య ( Balayya )బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా బాలయ్య గత సినిమా డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.మరీ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అదరగొట్టింది.
అయితే ఇరాన్ దేశంలోని న్యూస్ పేపర్ లో డాకు మహారాజ్ గురించి ప్రస్తావించడం గమనార్హం.
ఆ ఆర్టికల్ లో డాకు మహారాజ్( Daku Maharaj ) లో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారని యాక్షన్ సీన్స్ బాగున్నాయని పేర్కొన్నారు.
డాకు మహారాజ్ సినిమాలో హీరో రోల్ పవర్ ఫుల్ గా ఉందని రాబిన్ హుడ్ తరహాలో దీన్ని తీర్చిదిద్దారని ఆ ఆర్టికల్ లో ప్రస్తావించారు.ఈ సినిమా కథ గురించి, కలెక్షన్ల గురించి కూడా ఆర్టికల్ లో పేర్కొనడం కొసమెరుపు.
తెలుగు సినిమాకు సంబంధించిన వివరాలు అరబిక్ పేపర్ లో రావడం రేర్ అని బాలయ్య అభిమానులు చెబుతున్నారు.

బాలయ్య రెమ్యునరేషన్ ( Remuneration )ప్రస్తుతం 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ కాగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.బాలయ్య పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే తనకు హిట్లు ఇచ్చిన డైరెక్టర్లకు బాలయ్య ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు.బాలయ్య రాబోయే రోజుల్లో సైతం వరుస విజయాలు సాధించి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలయ్య లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.