న్యూస్ రౌండప్ టాప్ 20

1.బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తుఫాన్ల హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరంలో అల్పపీడనం కదులుతుందన్నారు.దీని ప్రభావంతో ఉత్తరకొస్తా, దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

2.పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

ఎగువ రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమయింది.ముందస్తు సహాయక చర్యలకు.ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయి.

3.తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా

తెలంగాణ బిజెపి ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఎంపీ లక్ష్మణ్ ఖండించారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడానికి అనుమతి ఇవ్వలేదని, నాయకుల ముందస్తు అరెస్టులు సరికాదని లక్ష్మణ్ మండిపడ్డారు.

4.విద్యాసంస్థల బంద్ కు టీఎన్ఎస్ఎఫ్ పిలుపు

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

ఈనెల 25న విద్యాసంస్థల బంద్ కు టీఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది.

5.పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు.పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మీటింగ్ కు వెళ్లారని,,  గతంలో ఆయన చేగువేరా డ్రెస్ వేసుకునే వారిని అన్నారు.

6.హుబ్లీ తంజావూరు రైలు రెండు నెలల పొడిగింపు

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

కర్ణాటకలోని హుబ్లీ నుంచి సేలం, కరూర్, తిరుచి మీదుగా తంజావూరు వరకు నడిచే ప్రత్యేక రైలు ను మరో రెండు నెలల పాటు దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.

7.ఓటుకు నోటు కేసు పై సుప్రీం లో విచారణ

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ ల పై విచారణ ఆగస్టు 28 వాయిదా వేసింది.

8.జగన్ పై కన్నా విమర్శలు

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

జులై 20వ తేదీ వచ్చినా కనీసం కాలవ మరమ్మత్తులు కూడా చేయలేదని రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారని, జగన్ రెడ్డి సైకో అని తాను తొలి నుంచి చెబుతున్నానని టిడిపి నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

9.రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు

తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది.

10.జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

బిజెపి జాతీయ అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

11.పుదుచ్చేరికి రాష్ట్రపతి

ఆగస్టు 6 7 తేదీల్లో పుదుచ్చేరిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు.

12.తిరుమల సమాచారం

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.టోకెన్ రహిత దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

13.తెలంగాణ హైకోర్టు సీజే గా జస్టిస్ అలోక్ అరాదే

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధే నియమితులయ్యారు.

14.మూలపేట పోర్ట్ కు 3,884 కోట్ల రుణం

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధికి రూ.3,884 కోట్ల రుణం లభించనుంది.

15.అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగింది.

16.అన్నవరంలో వివాహాలకు వయసు ధ్రువీకరణ తప్పనిసరి

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వివాహాలు చేసుకునేవారు ఇకపై తప్పనిసరిగా వయసు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఆలయ అధికారులు తెలిపారు.

17.భారీ వర్షాలపై జిహెచ్ఎంసి అలెర్ట్

గ్రేటర్ హైదరాబాద్ లో గత రెండు రోజులు వర్షం కురుస్తుండడంతో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది.నగరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేశారు.లోతట్టు ప్రాంతాల్లో డీ ఆర్ ఎఫ్ టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

18.‘మిధునం,’ కథ రచయిత శ్రీ రమణ మృతి

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

మిథునం సినిమా కథ రచయిత శ్రీ రమణ (71) అనారోగ్యంతో మృతి చెందారు.

19.ఎఫ్.సీ.ఐ లో నిల్వ వసతి పెంచాలి

ఎఫ్సీఐలో నిల్వ వసతులు పెంచాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Amit Sha, Cm Kcr, Cpi Yana, Godavaririver, Janasena, Jp Nadda, Pawan Kaly

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,700

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,750

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube