మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ వ్యవహారం చివరి దశకు చేరుకుంది.ఇందులో భాగంగా సీఎస్ జవహర్ రెడ్డిని సచివాలయంలో పేర్ని నాని కలిశారని తెలుస్తోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ రాకపోవడపంపై పేర్ని నాని సీఎస్ కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తీరును నిరసిస్తూ సీఎం జగన్ నివాసం వద్ద ధర్నా చేస్తానని పేర్ని నాని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వీరి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.







