రక్తంలో కొలస్ట్రాల్ అధికంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి.ఈ విషయం అందరికీ తెలుసు.
అందుకే కొలస్ట్రాల్ కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే కరివేపాకు టీతో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయొచ్చట.
కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతి రోజు ప్రతి ఇంట్లోనూ కరివేపాకును రుచి కోసం వినియోగిస్తుంటారు.కానీ, రుచికి మాత్రమే కరివేపాకు అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే, కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా కరివేపాకు టీతో మరిన్ని బెనిఫిన్ట్స్ పొందొచ్చు.
కరివేపాకు ఆకులను నీటిలో బాగా మరిగించి.అనంతరం వడకట్టుకోవాలి.అందులో కొద్దిగా అల్లం రసం మరియు తేనె కలిపి తీసుకోవాలి.ప్రతి రోజు ఈ కరివేపాకు టీని సేవించడం వల్ల రక్తంలోని పేరుకుపోయి ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను క్రమంగా కరిగిస్తుంది.
తద్వారా గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఈ కరివేపాకు టీతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రెగ్యులర్‌గా ఉదయాన్నే ఈ టీ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి మరియు ఇతర శ్వాసకోశ సమస్యలు నయం అవుతాయి.మధుమేహం వ్యాధి గ్రస్తులకు కూడా ఇది బెస్ట్ డ్రింక్.
ఎందుకంటే, కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రదానమైన రక్త నాళాలలో గ్లూకోస్ అదుపు చేస్తుంది.అలాగే మార్నింగ్ ఈ కరివేపాకు టీ తాగడం వల్ల అజీర్ణాన్ని అరికట్టి.
జీర్ణ శక్తి పెరిగేలా చేస్తుంది.మరియు మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది.
అదేవిధంగా, డయేరియా సమస్యతో బాధ పడేవారు ఈ కరివేపాకు టీ తాగితే.మంచి ఉపశమనం లభిస్తుంది.
కరివేపాకు రెగ్యులర్‌గా తాగడం వల్ల శరీరానికి ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ లభిస్తుంది.ఫలితంగా రక్త హీనత సమస్య దూరం అవుతుంది.
కరివేపాకు టీ సేవించడం వల్ల మరో బెనిఫిట్ ఏంటంటే.శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.