రోజుకో స్పూన్ వెన్న తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల్లో వెన్న కూడా ఒకటి.పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి మజ్జిగ, మజ్జిగ నుంచి వెన్న, వెన్న( butter ) నుంచి నెయ్యి తయారు అవుతుందన్న సంగతి మన అందరికీ తెలుసు.

 Do You Know The Health Benefits Of Eating Spoonful Of Butter A Day? Butter, Butt-TeluguStop.com

పాలు, పెరుగు, మజ్జిగ( Milk, curd, buttermilk ) మరియు నెయ్యిని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో కూడా అందరికీ ఒక అవగాహన ఉంది.కానీ చాలా మంది వెన్నను నిర్లక్ష్యం చేస్తుంటాడు.

వెన్న వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవని భ్రమ పడుతుంటారు.పైగా వెన్న తింటే ఆరోగ్యానికి మంచిది కాదని.

బరువు పెరిగిపోతారని భావిస్తుంటారు.

కానీ వెన్న కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నిజానికి ఇంట్లో తయారు చేసుకున్న వెన్నను రోజుకో టీ స్పూన్ చొప్పున తింటే మీరు ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.వెన్నలో విటమిన్ డి( Vitamin D ) ఉంటుంది.

ఇది శరీరంలో కాల్షియం( Calcium ) మరియు ఐరన్ శోషణకు సహాయపడుతుంది.ఎముకలను బలోపేతం చేస్తుంది.

రక్తహీనత బారిన పడకుండా అడ్డుకుంటుంది.

Telugu Butter Benefits, Tips, Latest-Telugu Health

అలాగే వెన్నలో ఉండే విటమిన్ ఏ ( Vitamin A )మరియు విటమిన్ ఈ కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.దృష్టిని మెరుగుపరుస్తాయి.చర్మ సమస్యల‌ను నివారిస్తాయి.

వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తాయి.

వెన్నలో ఉండే పలు పోషకాలు మెదడును చురుగ్గా మారుస్తాయి.జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి.

Telugu Butter Benefits, Tips, Latest-Telugu Health

అంతేకాదు వెన్న మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి ర‌క్షిస్తుంది.మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రొమ్ము, కడుపు క్యాన్సర్ రాకుండా నిరోధించే అవకాశాలను పెంచుతుంది.థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.మ‌రియు వెన్న దంత క్షయం నుండి సైతం రక్షిస్తుంది అయితే అధిక కేలరీలతో పాటు వెన్నలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వెన్నను అధిక మొత్తంలో తీసుకుంటే బరువు పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి వెన్నను లిమిట్ గా మాత్రమే తీసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube