కృష్ణంరాజు రాజుల కుటుంబంలో జన్మించాడు.అతని చేతికి ఎముక ఉండేది కాదు కేవలం అతడికి మాత్రమే కాదు తన కుటుంబంలో ఎవరు కూడా చేసిన సహాయం, దానధర్మాలు చెప్పుకోరు.
అందుకే కృష్ణంరాజును చాలా మంచి వ్యక్తిగా ఇండస్ట్రీ పొగుడుతూ ఉంటుంది.తోటి నటీనటులకు కూడా ఆయన ఇచ్చే మర్యాద, సహాయం ఎంతో గొప్పగా ఉంటుంది.
ఈ విషయం చెప్పింది మరి ఎవరో కాదు నటుడు కోట శ్రీనివాసరావు.అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఏమీ తెలియక నలిగిపోతున్న రోజులు.
కాల్షీట్ అనేది ఒకటి ఉంటుందనేది కూడా కోటకు తెలియని పరిస్థితి.ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడు కోట.
అసలు ఎంత పారితోషకం తీసుకోవాలో కూడా కోటకు తెలియకుండా ఉన్న రోజుల్లో ఓ రోజు కృష్ణం రాజు ప్రొడక్షన్ కంపెనీ అయిన గోపికృష్ణ ఆఫీస్ కి వెళ్లారు.కృష్ణంరాజు తాండ్రపాపారాయుడు చిత్రంలో 15 రోజులపాటు కోట శ్రీనివాసరావు నటించాడు.
దాంతో కృష్ణంరాజు సోదరుడైన సూర్యనారాయణ రాజు అదేనండి ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుగారు లెక్కలు చూసేవారు.తన సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఆఫీస్ కి వెళ్ళగా ఎంత ఇమ్మంటారో చెప్పమని సూర్యనారాయణ రాజు అడిగాడు.
కానీ అసలు రెమ్యూనరేషన్ ఇంత తీసుకోవాలన్న విషయం కూడా కోటాకు క్లారిటీ లేదు దాంతో నసగుతు కూర్చున్నాడు.

ఇక అదే సమయంలో కృష్ణంరాజు గారు ఎంట్రీ ఇచ్చారు కోట ని చూసి బాగా చేస్తున్నావ్… ఇలాగే చేయు… మంచి నటుడు అవుతావు.అంటూ చెప్పాడట.ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడగ్గా సూర్యనారాయణ రాజు కల్పించుకొని తాండ్రపాపారాయుడు కోసం 15 రోజులు పని చేశాడు డబ్బులు ఎంత కావాలి అంటే చెప్పకుండా కూర్చున్నాడు అని చెప్పగా కోట కి కృష్ణంరాజు ఒక సలహా ఇచ్చారట.
ఇక్కడ డబ్బులు ఎంత కావాలో అడగకుండా ఎవరు ఇవ్వరు 15 రోజులు చేశావు కదా 20000 తీసుకొని వెళ్ళు కొన్నాళ్లపాటు ఇలాగే తీసుకో.ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళు అని చెప్పారట.
దాంతో కోటా కూడా తూచా తప్పకుండా అదే విధంగా ఫాలో అయ్యారట.