ఈ అనారోగ్య సమస్యలకు అమృతంలా పనిచేసే బొబ్బర్లు..!

మన ఆరోగ్యానికి అలసందలు( Black Eyed Peas ) ఎంతో మేలు చేస్తాయని దాదాపు చాలా మందికి తెలుసు.ఇందులో అనేక పోషక విలువలు మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

 Health Benefits Of Eating Black Eyed Peas Details, Health Benefits , Black Eyed-TeluguStop.com

ఉడికించిన అలసందలు తింటే మనకు అందులోని అన్ని పోషకలు అందుతాయి.ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, పోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సోడియం, మెగ్నీషియం, జింక్, కాపర్ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

అలాగే ఈ అలసందలు మన ఆరోగ్యానికి ఇంకా విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజు ఉడికించిన అలసందలు తింటే అందులోని కాలుష్యం, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి.

Telugu Bad Cholestrol, Black Eyed Peas, Sugar Levels, Cow Peas, Benefits, Heart

దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.అంతేకాకుండా ఆందోళన మరియు ఒత్తిడి కూడా దూరమవుతుంది.జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది.అలసందలలో ఫైబర్ ప్రోటీన్ ఉన్నందున రక్తంలో చెడు కొలెస్ట్రాల్( Bad Cholestrol ) స్థాయిని తగ్గిస్తుంది.అంతే కాకుండా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా కంట్రోల్ చేస్తుంది.దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు( Heart Diseases ) రాకుండా మనల్ని రక్షిస్తుంది.

అలసందలు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది.రక్తంలో చక్కెర శాతాన్ని( Blood Sugar Levels ) అదుపు చేస్తుంది.

అలసందులు తినడం వల్ల కిడ్నీల పని తీరు మెరుగుపడుతుంది.మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.

Telugu Bad Cholestrol, Black Eyed Peas, Sugar Levels, Cow Peas, Benefits, Heart

అధిక బరువు( Over Weight ) తగ్గాలనుకునే వారు అలసందలు తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి బరువును కూడా తగ్గిస్తుంది.అలసందలలో విటమిన్ సి ఉండడం వల్ల చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.అంతేకాకుండా నిత్యం యవ్వనంగా కనిపిస్తారు.అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే చర్మం పై ముడతలు రాకుండా చేస్తుంది.అలాగే అలసందలలో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందున జుట్టు( Hair ) ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది.

అంతేకాకుండా అలసందలలో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.అలసందలు తినడం వల్ల మన శరీరానికి తక్షణమే శక్తి అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube