నూటికి 70 శాతం మందిలో అండర్ ఆర్మ్స్ ( Underarms )అనేవి డార్క్ గా ఉంటాయి.అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండటం వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
ముఖ్యంగా మహిళలు డార్క్ అండర్ ఆర్మ్స్ వల్ల చాలా సఫర్ అవుతుంటారు.స్లీవ్ లెస్ దుస్తులు ధరించడానికి సంకోచిస్తుంటారు.
అయితే అండర్ ఆర్మ్స్ డార్క్ గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.ప్రధానంగా చూసుకుంటే డియోడరెంట్లు వాడకం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, షేవింగ్, చెమట, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, హైపర్ పిగ్మెంటేషన్, హార్మోన్ చేంజ్, ఒంట్లో అధిక వేడి, బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ తదితర అంశాలు అండర్ ఆర్మ్స్ ను నల్లగా మారుస్తాయి.
ఆ నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.కొందరు బ్యూటీ పార్లర్ లో అండర్ ఆర్మ్స్ ను తెల్లగా మార్చుకునేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ ఖర్చు లేకుండా చాలా సులభంగా ఇంట్లోనే అండర్ ఆర్మ్స్ ను తెల్లగా మెరిపించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును( Lemon fruit ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking soda ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.రెగ్యులర్ గా ఈ సింపుల్ రెమెడీని పాటించడంతో పాటు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.పదేపదే షేవింగ్ చేసే అలవాటును మానుకోవాలి.
డియోడరెంట్లు వాడటం ఆపేయాలి.తద్వారా మీ అండర్ ఆర్మ్స్ నలుపు క్రమంగా వదిలిపోతుంది.
పది రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ గమనిస్తారు.కాబట్టి డార్క్ అండర్ ఆర్మ్స్ తో బాధపడుతున్న వారు పైన చెప్పిన సింపుల్ ఇంటి చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.