పార్టీ కీలక నాయకులు పక్క చూపు.. జగన్ కు ఇక టెన్షనే ?

వైసీపీ అధినేత జగన్ ( jagan )కు ముందు ముందు అన్ని ఇబ్బందికర పరిస్థితులే అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమి చెందింది.

 The Key Leaders Of The Party Are Looking At Jagan, Is There Any More Tension, Td-TeluguStop.com

కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ స్థానాలకే పరిమితం అయింది.టిడిపి,  జనసేన, బిజెపి ( TDP, Jana Sena, BJP )కూటమి భారీ మెజారిటీతో ఏపీలో అధికారం చేపట్టింది.

అసలు ఈ స్థాయిలో వైసిపి ఘోరంగా ఓటమి చెందడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు అంతు పట్టడం లేదు.  పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేసినా జనాలు ఎందుకు తమకు ఓట్లు వేయలేదనే విషయాన్ని జగన్ విశ్లేషించుకుంటున్నారు.

ఇక ఈ ఐదేళ్లు పార్టీని కాపాడుకుంటూ,  అధికారంలో ఉన్న కూటమి పార్టీలపై పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అంతకంటే ముందుగా పార్టీ నుంచి వలసలను నివారించడం అతి పెద్ద సవాల్ గా జగన్ కు మారబోతోంది.

Telugu Ap, Janasena, Key Jagan, Ysrcp, Ysrcp Join-Politics

ఇప్పటికే పార్టీలోని కీలక నేతలు,  మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ప్రస్తుత ఎమ్మెల్సీలు,  రాజ్యసభ సభ్యులు ఇలా చాలామంది టీడీపీ, బీజేపీ, జనసేనలలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా  వార్తలు వస్తున్నాయి.ఇవన్నీ వైసీపీలో మరింత కలవరాన్ని పు.ఈ ఐదేళ్లపాటు వైసీపీలోనే కొనసాగితే కేసులు తోపాటు, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉండడం, అధికారం ఉన్న పార్టీలో చేరితే ఈ ఐదేళ్లు లభించే గౌరవ,  మర్యాదలు, రాజకీయంగా, ఆర్థికంగా చేకూరే లబ్ధి ఇవన్నీ లెక్కలు వేసుకుని చాలామంది వైసిపి నేతలు కూటమి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.దీంతో ఈ వలసల కు బ్రేక్ వేయడం జగన్ కు అతి పెద్ద సవాల్ గానే మారుతోంది.

Telugu Ap, Janasena, Key Jagan, Ysrcp, Ysrcp Join-Politics

 ఇప్పటి వరకు జగన్ ఇమేజ్ మీదే ఆధారపడి గెలిచామని భావిస్తున్న నేతలకు ఎన్నికల ఫలితాలు పెద్ద షాప్ కి ఇచ్చాయి.దీంతో తమ ఓటమికి జగన్ వైఖరే కారణం అన్న అభిప్రాయము వైసీపీ నేతల్లో ఉంది .వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లలో కార్యకర్తలు, నాయకులను పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని,  కేవలం సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి సారించి అభివృద్ధి చేపట్టకపోవడం,  జనాల్లో ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులకు పెద్దగా విలువ లేకుండా పూర్తిగా అధికారులు, వాలంటీర్ల ద్వారానే పరిపాలన చేయడం ఇవన్నీ తీవ్రంగా ప్రభావం చూపించాయి అని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.2026 లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుండడంతో టిక్కెట్ల హామీతో  వైసిపి నేతలను చేర్చుకునేందుకు కూటమి పార్టీలైన టిడిపి, జనసే,న బిజెపిలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ ఐదేళ్లపాటు పార్టీ నుంచి వలసలు జరగకుండా అడ్డుకోవడం జగన్ కు కత్తి మీద సాములా మారనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube