మహిళల్లో చాలా మందిని కలవరపెట్టే సమస్యల్లో ఫేషియల్ హెయిర్( Facial Hair ) ఒకటి.సాధారణంగా ఆడవారిలో కొందరికి ముఖంపై అవాంఛిత రోమాలు అంతగా కనిపించవు.
కానీ కొందరికి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఇలాంటివారు ఫేషియల్ హెయిర్ ను తొలగించుకునేందుకు వాక్సింగ్ లేదా థ్రెడింగ్ ను ఎంచుకుంటారు.
అయితే ఇవి రెండూ ఖర్చు మరియు పెయిన్ తో కూడుకున్నవే.ఈ రెండిటితో అవసరం లేకుండా సహజంగా కూడా ఫేషియల్ హెయిర్ ను వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గోధుమపిండి( Wheat Flour ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి,( Ghee ) పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు సరిపడా పచ్చి పాలు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై హెయిర్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో చర్మాన్ని రబ్బింగ్ చేసుకుంటూ వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.ఫైనల్ గా వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే ముఖంపై అవాంఛిత రోమాలు మొత్తం తొలగిపోతాయి.అలాగే ఈ రెమెడీ ఫేషియల్ హెయిర్ గ్రోత్ ను తగ్గిస్తుంది.స్కిన్ ను క్లియర్ అండ్ క్లీన్ గా మారుస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి స్కిన్ అందంగా ఆకర్షణీయంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి ఫేషియల్ హెయిర్ ను న్యాచురల్ గా రిమూవ్ చేసుకోవాలని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.








