సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయి.అందులో ఆషాఢ శుద్ద ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు.
తొలి ఏకాదశిని శయనైక ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు.నేడు మహా విష్ణువు శయనంలోకి వెళ్తారని హిందూ ధర్మం చెబుతోంది.
తొలి ఏకాదశి రోజున హిందువులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు.ముఖ్యంగా మహా విష్ణువును పూజించేందుకు దేవాలయాలకు భక్తులు క్యూలు కడుతూ ఉంటారు.
తొలి ఏకాదశి సందర్బంగా కొన్ని ప్రాంతాల్లో సెలవులు కూడా ప్రకటిస్తూ ఉంటారు.

పూర్వకాలంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరంతో ముల్లోకాలను అష్ట కష్టాలు పెడుతున్న సమయంలో మహా విష్ణువు అతడితో ఏకంగా వెయ్యి సంవత్సరాలు పోరాడి అలసి పోతాడు.అలా అలసి పోయి ఒక గుహలో నిద్రకు ఉపక్రమిస్తాడు.ఆ సమయంలోనే మహా విష్ణువు నుండి ఒక కన్న ఉద్బవిస్తుంది.
ఆమె ఆ మురాసురుడిని తుదముట్టిస్తుంది.దాంతో ఆమెకు మహావిష్ణువు ఏం కావాలో కోరుకో అంటూ వరమిస్తాడు.
విష్ణువుకు ఇష్టమైన దానిగా నన్ను లోకం పూజించాలంటూ కోరడం జరుగుతుంది.అందుకే రుషులు మరియు దేవతులు అంతా ఆమెను ఏకాదశిగా పిలుస్తారు.
అప్పటి నుండి ఏకాదశి రోజున ఆ కన్యకు పూజలు చేస్తూ మహా విష్ణువును ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు.

ఇక తొలి ఏకాదశి సందర్బంగా ఒకప్పుడు పేలాల పిండి తినడం ఆనవాయితీగా ఉండేది.ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పేలాల పిండి తయారు చేస్తారేమో కాని ఎక్కువ శాతం మాత్రం ఇది కనిపించడం లేదు.ఇంతకు ఈ పేలాల పిండి ఎందుంటే.
పేలాలు పితృ దేవతలకు చాలా ఇష్టమైనవి.అందువల్ల మన పూర్వీకులను గుర్తు చేసుకుని వారిని పూజించేందుకు పేలాల పిండి తినేవాళ్లం.
అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి.శరీరంలో ఉన్న వేడిని కూడా ఇది తొలగిస్తుందని పెద్దలు అంటున్నారు.
మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.ఆ మహా విష్ణువు మీకు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నాం
.