స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

స్కిన్ వైటెనింగ్ కోసం కొంద‌రు తెగ ఆరాట‌ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే ఖ‌రీదైన క్రీమ్స్‌, మాయిశ్చ‌రైజ‌ర్స్‌, సీర‌మ్స్ అంటూ ర‌క‌ర‌కాల ప్రోడెక్ట్స్‌ను యూస్ చేస్తుంటారు.

 This Oil Help To Improve Your Skin Tone! Skin Tone, Oil, Carrot Clove Oil, Skin-TeluguStop.com

ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ పాటిస్తారు కానీ, కొంద‌రు ఎన్ని వాడినా స్కిన్ మాత్రం వైట్‌గా మార‌దు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే ఇకపై చింతించ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ ఆయిల్‌ను వాడితే స‌హ‌జంగానే మీ స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆయిల్ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక క్యారెట్ తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇప్పుడు కడిగిన‌ క్యారెట్‌ను స‌న్న‌గా తురుముకుని ఎండ‌లో ఓ గంట పాటు ఎండబెట్టుకోవాలి.ఆ త‌ర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో ఎండ బెట్టుకున్న క్యారెట్ తురుము, ప‌ది నుంచి ప‌దిహేను ల‌వంగాలు, ఒక క‌ప్పు బాదం నూనె వేసుకుని బాగా క‌లిపి మూత పెట్టి ఒక రోజు వ‌దిలేయాలి.

త‌ర్వాత రోజుకి ఆయిల్ క‌ల‌ర్ ఛేంజ్ అవుతుంది.అప్పుడు ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో ఆయిల్ ను స‌ప‌రేట్ చేసుకుని.అందులో వ‌న్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్‌ను యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే క్యారెట్‌-మిరియాల నూనె త‌యారు అవుతుంది.ఒక బాటిలో ఈ క్యారెట్‌-మిరియాల ఆయిల్‌ను నింపుకుంటే గ‌నుక ప‌ది రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

Telugu Tips, Carrot, Latest, Skin Care, Skin Care Tips, Skin Tone, Skin, Skin Oi

ఈ ఆయిల్‌ను ఎలా యూస్ చేయాలంటే.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేక‌ప్ మొత్తాన్ని పూర్తిగా తొల‌గించి వాట‌ర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై త‌యారు చేసుకున్న ఆయిల్‌ను ముఖానికి ప‌ట్టించి స్మూత్‌గా నాలుగైదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే స్కిన్ టోన్ అద్భుతంగా పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube