శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షిలో వెలసి ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు.మంగళవారం రోజు సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగాడ నుంచి లేపాక్షి దేవాలయ సందర్శనకు జి20 విదేశీ ప్రతినిధులు వచ్చారు.
లేపాక్షి దేవాలయం వద్దకు చేరుకున్న 29 మంది జి20 విదేశీ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నత అధికారులు, తదితరులు వీరికి ఘన స్వాగతం పలికారు.ఆ తర్వాత పులమాలతో వారికి సత్కరించి పూర్ణకుంభంతో టి20 విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు.

ఆ తర్వాత లేపాక్షి దేవాలయంలోకి వెళ్లిన జి20 విదేశీయులకు అమరావతి సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజిస్టులు ప్రకాష్, కమల్ హసన్ లేపక్షి దేవాలయ ప్రాశస్త్యం చరిత్ర దేవాలయ నిర్మాణం,కట్టడాలు, సభ మండపం విజయనగర సామ్రాజ్యంలో దేవాలయానికి ఉన్న ప్రాధాన్యత కుడ్య వర్ణ చిత్రాలు, శిల్ప సంపద, వాస్తు నిర్మాణశైలి, వ్యాపార, వాణిజ్య,ఆధ్యాత్మిక కళలకు ఉన్న కీర్తి ఏకశిలా గణేశుడు, నాగలింగం విశిష్టత, నాట్య మండపం, సీతమ్మ పాదం, భజనశాల వేలాడే 68 స్తంభాలు తదితర వివరాలను జి20 విదేశీ ప్రతినిధులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా లేపాక్షి దేవాలయం సందర్శించిన జి20 విదేశీ ప్రతినిధులు దేవాలయ నిర్మాణం అద్భుతం అని తెలియజేశారు.ఆ తర్వాత లేపాక్షి దేవాలయం నుంచి బయలుదేరి వెళ్లి అతిపెద్ద ఏకశిలానంది విగ్రహాన్ని విదేశీ ప్రతినిధులు తిలకించారు.టి20 విదేశీ ప్రతినిధులకి జిల్లా కలెక్టర్, పెనుగొండ సబ్ కలెక్టర్ అమరావతి సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నత అధికారులు, తదితరులు జి20 విదేశీ ప్రతినిధులకు వీడ్కోలు పలికారు.