కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి గుడ్ కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్) కాగా.
బ్యాడ్ కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్) మరొకటి.ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, పలు రకాల మందుల వాడకం వంటి కారణాల వల్ల బ్లెడ్‌లో ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగిపోతుంటాయి.
ఇది పెరిగే కొద్ది గుండెకు ముప్పు కూడా పెరుగుతుంటుంది.అందుకే బ్లెడ్‌లో ఎప్పటికప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించుకుంటూ ఉండాలి.
అందుకు కొన్ని కొన్ని కూరగాయలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తరిమి కొట్టి గుండెను ఆరోగ్యవంతంగా మార్చడంలో బెండకాయ సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.అదే సమయంలో కంటి చూపు రెట్టింపు అవుతుంది.
కిడ్నీ సంబంధిత వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు మధుమేహం అదుపులో ఉంటుంది.
అందుకే తరచూ బెండకాయను తింటూ ఉండాలి.
వంకాయచాలా మంది దీనిని ఎవైడ్ చేస్తుంటారు.
కానీ, వంకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.ముఖ్యంగా బ్లెడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగాలంటే వారంలో కనీసం రెండు సార్లు అయినా వంకాయను తినాల్సిందే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడంలో టమాటో కూడా చాలా బాగా సహాయపడుతుంది.రోజుకు ఒక టమాటోను ఏదో ఒక రూపంలో తీసుకుంటే గుండె సంబంధిత జబ్బలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు బీన్స్‌కు సైతం ఉన్నాయి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు బీన్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే గనుక కొలెస్ట్రాల్ కరుగుతుంది.ఎముకలు దృఢంగా మారతాయి.అతి ఆకలి సమస్య తగ్గుతుంది.నిద్రలేమి నుంచి విముక్తి లభిస్తుంది.మరియు మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.