బార్లీ( Barley ).ఒక పోషకాహారమైన ధాన్యమని అందరికీ తెలుసు.
కొన్ని ప్రాంతాల్లో బార్లీని ప్రధానంగా ఆహారంగా తీసుకుంటారు.ఆరోగ్య ప్రయోజనాల గురించి పక్కన పెడితే.
అందానికి మరియు చర్మ సంరక్షణకు బార్లీ విస్తృతంగా ఉపయోగపడుతుంది.అవును, బార్లీతో అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బార్లీ నీరు చర్మానికి ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ మారిదిగా ఉపయోగపడతాయి.
బార్లీని మరిగించిన తర్వాత వచ్చే నీటిని ఒక కాటన్ బాల్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి.తద్వారా డ్రై స్కిన్ సమస్య ( Dry skin problem )దూరం అవుతుంది.
చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.బార్లీ నీరు నిత్యం ముఖానికి పూయం వల్ల.
అందులోని యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) చర్మాన్ని వృద్ధాప్య లక్షణాల నుంచి రక్షిస్తాయి.యూత్‌ఫుల్ స్కిన్ ను మీ సొంతం చేస్తాయి.
స్కిన్ వైట్నింగ్( Skin whitening ) మరియు బ్రైట్నింగ్ కు బార్లీని ఉపయోగించవచ్చు.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బార్లీ పిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే చర్మం బార్లీలో ఉన్న పోషకాలు చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మారుస్తాయి.
అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.
బార్లీతో చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను చాలా సులభంగా తొలగించుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బార్లీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని మిక్స్ చేయండి.ఈ మిశ్రమాన్ని చర్మంపై స్క్రబ్‌లా ఉపయోగిస్తే.
చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.
చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.స్కిల్ హెల్తీగా మారుతుంది.