గంటలు తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేయడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, కంటినిండా నిద్ర లేకపోవడం, మద్యపానం అలవాటు తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మంది బెల్లీ ఫ్యాట్( Belly fat ) సమస్యతో బాధపడుతున్నారు.బాన పొట్ట వల్ల శరీర ఆకృతి పాడవడంతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
కాబట్టి పొట్ట కొవ్వును కరిగించుకోవడం చాలా అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
అందుకోసం ముందుగా అంగుళం అల్లం ముక్కను( inch piece of ginger ) తీసుకుని పొట్టు తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అందులో ఫ్రెష్ అల్లం తురుము, నాలుగు లెమన్ స్లైసెస్( Lemon slices ) మరియు రెండు బిర్యానీ ఆకులు( Biryani leaves ) వేసి ఉడికించాలి.దాదాపు 8 నుంచి 10 నిమిషాలు పాటు బాయిల్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ తేనె( honey ) కలిపితే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ రెడీ అవుతుంది.రోజూ మార్నింగ్ ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ మెటబాలిజం రేటు ను పెంచుతుంది.దాంతో క్యాలరీలు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేసుకోండి.పైగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది.మరియు ఈ డ్రింక్ శరీరంలో పెరిగిపోయిన మలినాలను బయటకు పంపుతుంది.బాడీని డీటాక్స్ చేస్తుంది.