ముఖ్యంగా చెప్పాలంటే బంధువులకు, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి సందర్భాన్ని బట్టి బహుమతులు కూడా ఇస్తూ ఉంటాము.ఆ ఫంక్షన్ ను బట్టి వారికి ఏది నచ్చుతుందో అలాంటి బహుమతులు ఇవ్వాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.
అయితే అది ఎలాంటి సందర్భం అయినా కొన్ని వస్తువులు బహుమతిగా ఇవ్వడానికి సరైనవి.అయితే నిత్యం జీవితంలో ఉపయోగించే వస్తువులను బహుమతిగా ఇవ్వాలని హడావుడిలో చాలామంది కొన్ని వస్తువులను బహుమతిగా ఇస్తూ ఉంటారు.
వాస్తు శాస్త్రం( Vastu Shastra )లో మనం ఇచ్చే బహుమతులకి ముఖ్యమైన స్థానం ఉంది.

అందువల్ల కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు.మనం ఇచ్చే వస్తువులు ఆ ఇంటిని మరియు అక్కడి శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి.దాని వల్ల అక్కడి శక్తి వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ముఖ్యమైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతిగా ఇవ్వకూడదు.మీరు మీ బంధువుల జీవితంలో సానుకూల పురోగతిని కోరుకుంటే ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ముఖ్యంగా చెప్పాలంటే కత్తులు, పదునైనా వస్తువులను ఏ కారణం చేతనైనా బహుమతిగా ఇవ్వకూడదు.ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి.
అలాగే నలుపు రంగు ప్రతికూల అర్థాన్ని కలిగి ఉంటుంది.అందువల్ల నల్లని వస్త్రంతో సహా ఎలాంటి నల్లని పదార్థాన్ని బహుమతిగా ఇవ్వకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే ముళ్ళు ఉన్న మొక్కలను( Plants ) కూడా బహుమతిగా ఇవ్వడం అసలు మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.గడియారం( clock ) కూడా బహుమతులుగా ఇవ్వకూడదు.ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను కూడా బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు.అలాగే అద్దాలను కూడా బహుమతులుగా ఇవ్వకూడదు.చాలా మంది వ్యక్తులు పర్సులు, బ్యాగులు ఇతర తొలు వస్తువులను బహుమతిగా ఇస్తారు.అయితే తొలు వస్తువులు కూడా బహుమతిగా ఇవ్వకూడదు.
చర్మం ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది.అందుకోసం ఇలాంటి వస్తువులను ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు.