గురువారం రోజు శ్రీవారికి పూలంగి సేవ ఎందుకు చేస్తారో తెలుసా..

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు దేశ నలుమూలల నుంచి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామివారికి పూలంగి సేవా చేయడం ఆనవాయితీగా వస్తోంది.

 Why Poolangi Seva Conducts On Thursday In Tirumala Details, Poolangi Seva , Thur-TeluguStop.com

స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి అరుదైన సుగంధ పుష్పాలతో స్వామివారిని అర్చకులు అలంకరిస్తారు.దీనినే పూలంగి సేవ అనే చెబుతూ ఉంటారు.

ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో మాత్రమే అలంకరించిన స్వామివారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు.

బుధవారం రోజు స్వామివారిని దాదాపు 70000 మంది భక్తులు దర్శించుకున్నారు.

దాదాపు 30 వేల మంది భక్తులు తలలిలాలను సమర్పించారు.అంతేకాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దాదాపు పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది.ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

శ్రీవారి దేవాలయంలో ప్రతిరోజు ప్రత్యూష కాల ఆరాధనతో దేవాలయ ద్వారాలు తెరిచి అర్చకులు బంగారు వాకలి వద్ద సుప్రభాత శ్లోకాలను పటిస్తూ వేద పండితులు స్వామివారిని మేలుకొలుపుతారు.

సన్నిధి గొల్లలు, జియ్యoగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు.బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రం, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదన పచ్చిపాలన నివేదిస్తారు.అంతకు ముందు రోజు రాత్రి పవళింపు సేవలో బంగారు నవారు మంచంపై ఉన్న శ్రీవారు శ్రీనివాసమూర్తి వారికి మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనం పై జీవ స్థానంలో వేయింపచేస్తారు.

ఆ తర్వాత ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరంజనం సమర్పణ జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube