ఇటీవల కాలంలో మాస్ మహారాజా రవితేజ సినిమాలకు భారీ క్రేజ్ రావడం లేదు.అందుకు చాలా కారణాలే ఉన్నాయి.
ఈయన ఒక సినిమాతో హిట్ అందుకుంటే వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.దీంతో రవితేజ సినిమాలు అంటే క్రేజ్ తగ్గిపోతుంది.
అయితే అనూహ్యంగా రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాపై మాత్రం ఎప్పుడు లేనంత క్రేజ్ పెరిగి పోయింది.
రవితేజ ఆయన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ప్రెజెంట్ చేస్తున్న సినిమా కోసం రెండు వారాల ముందు నుండే వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు.
ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాతో అయినా అన్ని ప్లాప్స్ ను మరిపించేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అలరించాయి.ఇటీవల కాలంలో రవితేజ సినిమాలకు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు క్రేజ్ లభిస్తుంది.
దీంతో ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా రేపు బరిలోకి దిగబోతున్న ఈ సినిమా బిజినెస్ బాగానే చేసినట్టు తెలుస్తుంది.గత రెండు సినిమాలు పరాజయం పొందిన కూడా ధమాకా సినిమాకు భారీ బిజినెస్ జరిగింది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అంటే 18.50 కోట్లు అని తెలుస్తుంది.మరి ధమాకా బ్రేక్ ఈవెన్ కావాలంటే 19 కోట్లు వసూళ్లు చేయాల్సిందే.
మరి మాస్ రాజా ఈసారి అయిన బ్రేక్ ఈవెన్ చేస్తుందో లేదో చూడాలి.