హిందూ పురాణాల్లో ఒక రోజు ఒక దేవత కి అంకితం చేయబడింది.అందులో శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ( Goddess Lakshmi )అంకితం చేశారని దాదాపు చాలా మంది ప్రజలకి తెలుసు.
ఈ రోజు లక్ష్మీదేవినీ ప్రసన్నం చేసుకున్నందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.లక్ష్మీదేవిని ప్రతి రోజు పూజించినట్లయితే జీవితంలో ఎప్పుడూ సంపద కొరత, ఆర్థిక నష్టాలు ఉండవని చాలామంది ప్రజలు నమ్ముతారు.
శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్ర దేవుడిని అంకితం చేయబడింది.శుక్ర దేవుడిని పూజిస్తే ఇంట్లో శ్రేయస్సుతోపాటు ఆనందం లభిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం రోజు కొన్ని పనులు, కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్రం( Vastu Shastra ) చెబుతోంది.లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేసినట్లయితే జీవితంలో డబ్బు కొరత ఉండదని,శుక్రదేవుని అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అయితే శుక్రవారం రోజు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.శుక్రవారం రోజు ఆస్తులకు సంబంధించి ఎలాంటి పనులు కూడా చేపట్టకూడదు.

శుక్రవారం ఆస్తిని కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు.ఎందుకంటే శుక్రవారం రోజు ఆస్తులు కొనుగోలు చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపించినట్లే అవుతుందని చెబుతున్నాయి.అంతే కాకుండా వంటగది, పూజగది( Kitchen, worship room ) సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదు.శుక్రవారం రోజు బట్టలు కొనుగోలు చేయొచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది.
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లటి వాహనం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.అందానికి సంబంధించిన వస్తువులను శుక్రవారం కొనుగోలు చేయడం చాలా శుభంగా భావిస్తారు.

ఇంకా చెప్పాలంటే శుక్రవారం ఇలాంటి పనులను అస్సలు చేయకూడదు.శుక్రవారం డబ్బు లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.శుక్రవారం ఎవరికీ పంచదార ఇవ్వకూడదు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.అంతేకాకుండా జాతకంలో శుక్రుడి స్థానం బలహీనపడుతుంది.శుక్రవారం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
దీని వల్ల లక్ష్మీదేవికి సంతోషం, ఆనందం కలుగుతుంది.శుక్రవారం రోజు పొరపాటున కూడా చిరిగిన, మురికి దుస్తులను ధరించకూడదు.