సంతానం లేమి( Childlessness ) తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది.చాలా అనారోగ్య సమస్యలలో ఇది కూడా ఒకటి అని నిపుణులు చెబుతున్నారు.
అయితే పిల్లలు కలగక బాధపడే వారిలో కొందరు దీనికి వాస్తు దోషాలే( Vaastu Doshas ) కారణమని నమ్ముతున్నారు.మరి సంతాననికి వాస్తు దోషానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందాల్సిన సంతోషాలలో సంతానము ఒకటి.ఇది దంపతుల ఇద్దరికీ ఒక వరం లాంటిది.

వివాహం అయిన తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటూ ఉంటుంది.అయితే రకరకాల కారణాల వల్ల కొందరికి సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంది.మరి కొందరిలో అయితే జీవితాంతం ఇది తీరని కోరిక లాగా ఉంటుంది.అలా సంతానం కలగని కొందరు తమ కర్మ ఇంతేనేమో అని సరిపెట్టుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉంటారు.
అయితే వాస్తు లాంటివి నమ్మే మరికొందరు మాత్రం వాస్తు దోషాల వల్లే తమకు పిల్లలు కలగడం లేదని అంటున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు పుట్టకపోవడానికి వాస్తు దోషం కారణము అనేది మనం సృష్టించుకున్న కల్పితలాలలో ఒకటి.

వాస్తు దోషానికి సంతానం కలగకపోవడానికి అసలు సంబంధమే లేదు అని నిపుణులు చెబుతున్నారు.ఈ మూలా ఇలా ఉంటే అరిష్టం, ఈ మూల అలా ఉంటే పిల్లలు పుట్టరు అని కొందరు నమ్ముతూ ఉంటారు.కానీ ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఉండే విషయాలు ఇలాంటి వాటిని ఏమాత్రం నమ్మకూడదు.సైన్స్ ప్రకారం గా ఇది ఆమోదయోగ్యం కాదు.ఒకవేళ వాస్తు దోషం నిజమైతే ఒకరి మీద ప్రభావం చూపితే అందరి పైన చూపాలి.కానీ సైన్స్ అలా కాదు.
ఇది నిజ నిర్ధారణ మీద ఆధారపడి ఉంటుంది.సంతానం కలగకపోవడానికి వాస్తు దోషాలకు సంబంధం లేదు.
అలాంటి నమ్మకాలను మనసులో పెట్టుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.