తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.నాలుగో రోజు వైకుంఠ ద్వార దర్శనమును తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి లోటు రాకుండా భద్రతను ఏర్పాటు చేసింది.
టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే స్వామి వారి దర్శనానికి రావాలని టీటీడీ వెల్లడించింది.దీనివల్ల భక్తులు త్వరగా స్వామి వారి దర్శన భాగ్యం పొందుతున్నారు.బుధవారం రోజు దాదాపు 61 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు.18,000 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.బుధవారం రోజు స్వామివారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్ల 19 లక్షలు.
ఇంకా చెప్పాలంటే టోకెన్లు కలిగిన భక్తులను నిర్దేశించిన సమయానికి మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
దీనివల్ల ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లు కలిగిన భక్తులు కేవలం రెండు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తి చేసుకుంటూ ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు మూడు గంటల సమయంలోనే స్వామివారి దర్శనం పొందుతున్నారు.
ఇంకా చెప్పాలంటే నవనీత హారతి సమర్పించిన తర్వాత శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి పవళింప చేస్తారు.ఆ తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామార్చన సేవను నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామ వాలిలోని 1008 నామాలు పటిస్తుండగా తులసీదళాలతో శ్రీవారికి అర్చన చేస్తారు.అర్చన తర్వాత స్వామివారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదిక ను సన్నాహాలు జరుపుతూ ఉంటారు.
ఆ తర్వాత స్వామి వారి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదంలో నివేదనలు సమర్పిస్తారు.

ఆ తర్వాత ఈ రోజు తిరుప్పావైడ సేవను నిర్వహించిన తర్వాత సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్ దర్శనాలకు భక్తులను అనుమతిస్తూ ఉంటారు.ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు.ఆ తరువాత స్వామివారి వంటిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి శాస్త్రోక్తంగా పులంగి సేవను అర్చకులు నిర్వహిస్తారు.