హిందూమతంలో అనేక పండుగలు, పర్వదినాలు వస్తాయి.ప్రతి పండుగకు విశిష్టత ఉంటుంది.
హిందూ మతంలో అతిపెద్ద పండుగలో సంక్రాంతి( Sankranti ) ఒకటి.తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఈ పండుగలో రెండో రోజు మకర సంక్రాంతి.అయితే ఈరోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణడు తన తనయుడు శనిశ్వరుడు అధిపతి అయిన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.ఈరోజున ప్రధానంగా సూర్యభగవానుని పూజిస్తారు.
ఈ పండుగ సూర్య భగవానుడికి( Surya Bhagawan ) అంకితం చేయబడింది.ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వలన సుఖ,సంపదలు కలుగుతాయి.ఈరోజున సూర్యభగవానుడికి భక్తితో పూజించి, అర్ఘ్యం సమర్పిస్తే భక్తులు కోరుకున్న కోరికలన్నీ సూర్యుడు తీరుస్తాడు.అయితే మకర సంక్రాంతి రోజున సూర్య భగవానున్ని పూజించే సరైన పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే సంక్రాంతి నాడు తెల్లవారుజామున నిద్రలేచి సూర్య భగవానుని ఆరాధించి పవిత్ర నదిలో స్నానం( Sacred River Bath ) చేయాలి.ఇక నది స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకోవాలి.

స్నానం చేసిన తర్వాత రాగి పాత్రను తీసుకొని అందులో నీరు పోసుకొని, ఎరుపు పువ్వులు, అక్షతలను కలుపుకోవాలి.ఇక ఆ నీటిని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాలను పటిస్తే శుభం కలుగుతుంది.ఇక ఆ రోజున సూర్య భగవానుడు మకర రాశిలోకి( Makara Raasi ) ప్రవేశిస్తాడని,అప్పుడు వెంటనే వాతావరణంలో కూడా మార్పు వస్తుందని నమ్ముతారు.
సూర్యుడిని శివుడి మూడు కన్నులలో ఒకటైన త్రినేత్రంతో పోలుస్తారు.

మకర సంక్రాంతి రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది.కాబట్టి ఈరోజు తప్పకుండా సూర్యున్ని పూజించాలి.ఎవరి జీవితంలోనైనా సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలి అంటే మకర సంక్రాంతి రోజున తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, స్నానపు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేసుకోవాలి.
శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి సూర్యభగవానుడినికి ధ్యానం చేయాలి.అలాగే సూర్య భగవానుని 12 పేర్లను జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.ఈ విధంగా చేయడం వలన సూర్య భగవానుడు మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడు.