ఆంజనేయ స్వామి దేవాలయంలోకి ఆడవాళ్లకు ప్రవేశం లేదు.. పొంగళ్ళు వండేది మగవారే ఎక్కడంటే..

పండుగల రోజులైనా, జాతరలు జరిగినప్పుడైనా అమ్మాయిలు, మహిళలు అక్కడికి వచ్చి ఎంతో సందడి చేస్తూ ఉంటారు.జాతరలలో ఆడవారు ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు.

 Women Are Not Allowed In The Temple Of Anjaneya Swamy , Anjaneya Swamy , Andhra-TeluguStop.com

కానీ ఓ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగే పొంగళ్ల పండుగ చేసేది మాత్రం మగవాళ్లే.ఎందుకంటే ఈ ఆంజనేయస్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.

అక్కడ పొంగళ్లను కూడా మగవారే చేస్తూ ఉంటారు.స్వామివారికి వారే స్వయంగా నైవేద్యం పెడతారు.

ఆ తర్వాత ఆ పొంగలి నీ వారే తింటారు.పొంగలి వంటకంలో ఆడవాళ్లను పాల్గొనరు.

పొంగళ్ల పండుగ రోజు ఆడవాళ్లు గుడిలోకి వచ్చిన అరిష్టం జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.

దీని వల్ల పొంగళ్ల పండుగ రోజున ఆడవాళ్లు గుడిలోకి అడుగుపెట్టరు.

కేవలం హారతి తీసుకోవడానికి మాత్రమే గుడి వద్దకు వస్తూ ఉంటారు.అది కూడా గుడి బయట నిలబడి హారతి కన్నులకు అద్దుకొని వెళ్లిపోతారు.

మిగిలిన అన్ని రోజుల్లో ఈ సంజీవ రాయుణ్ణి ఆలయంలోకి దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం ఉంటుంది.కేవలం పొంగల్లా పండుగ రోజున మాత్రం మహిళలకు దేవాలయంలోకి ప్రవేశం ఉండదు.

ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని పుల్లంపేట మండలంలో తిప్పాయపల్లె లో ఉన్న ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది.

Telugu Andhra Pradesh, Anjaneya Swamy, Devotional, Kadapa, Sankranti-Latest News

ఈ దేవాలయంలో సంక్రాంతి రోజున స్వామివారికి పొంగలిని నైవైద్యంగా సమర్పిస్తారు.ఎక్కడైనా దేవుళ్ళకు మొక్కులు మొక్కితే ఆడవాళ్లు పొంగళ్ళు పెట్టి ఆదే మొక్కలను తీర్చుకుంటూ ఉంటారు.కానీ ఈ దేవాలయంలో మాత్రం వింతగా ఆడవాళ్ళకి బదులుగా మగవాళ్ళే పొంగలి పెట్టి మొక్కలు తీర్చుకుంటారు.

ప్రతి సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవయ్య రాయునికి పొంగళ్ళు పెట్టి ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు.ఆదివారం ఉదయం నుంచి పురుషులు పొంగలి సామాగ్రిని బుట్టలో దేవాలయానికి తీసుకొచ్చి పొంగళ్ళు పెట్టి సంజీవరాయునికి నైవేద్యంగా సమర్పిస్తారు.

కేవలం మగవాళ్లే పొంగళ్లను నైవేద్యంగా సమర్పించడమే కాకుండా సామాగ్రిని కూడా ఆడవారు తాకరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube