తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ దర్శించుకున్నారు.ఈ ఉదయం విఐపీ విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు.
దర్శనాంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.