ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చలిపులి రోజురోజుకు బలపడుతోంది.
ఈ చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే వింటర్ లో సహజంగానే ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతుంది.
దీని కారణంగా సీజనల్ వ్యాధులు ఎటాక్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.పటిష్టమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్మించుకోవడం ఎంతో అవసరం.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిలో చపాతి – బెల్లం కాంబినేషన్ కూడా ఒకటి.
ఇది కొంచెం వింత కాంబినేషన్ అయినప్పటికీ చలికాలంలో చపాతీని బల్లెంతో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.

గోధుమ పిండితో తయారు చేసిన చపాతీని బెల్లం( Chapati jaggery ) సిరప్ తో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.పైగా చపాతీ మరియు బెల్లంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీ పవర్ ను రెట్టింపు చేస్తాయి.దాంతో జలుబు, దగ్గు( Cold cough ) వంటి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
అలాగే బెల్లం లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.చపాతీని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల మనలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి.
ఫలితంగా రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.

చపాతీ మరియు బెల్లం లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్ ఎసిడిటీ, ( Gas acidity )మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
అలాగే ఈ సీజన్ లో చలిని తట్టుకునే సామర్థ్యం లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.అయితే చపాతీని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది.
చలి పులిని ఎదిరించే సామర్థ్యం మీకు లభిస్తుంది.అంతేకాదు చపాతి బెల్లం కలిపి తింటే ఎక్కువ సమయం పాటు ఎనర్జిటిక్ గా ఉంటారు.
తరచూ ఆకలి వేయకుండా ఉంటుంది.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మరియు ఒత్తిడి దూరమై మైండ్ చాలా వేగంగా సైతం పనిచేస్తుంది.కాబట్టి చలికాలంలో చపాతీ మరియు బెల్లం కాంబినేషన్ ను అస్సలు మిస్ అవ్వకండి.