ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని ఆల్బనీస్( Australian PM Anthony Albanese ) తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
తరువాత మీడియా కోసం ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.స్టేజీపై ఎక్కువ మంది నేతలు ఉన్న సమయంలో ఆయన మధ్యలోకి వెళ్లాలని ప్రయత్నించారు.
కానీ, దురదృష్టవశాత్తు ఫొటోలకు ఫోజులిస్తూ ఆయన స్టేజీ పైనుంచి కిందపడిపోయారు.ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆయనను వెంటనే సిబ్బంది లేపి, ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని చూసారు.అతనికి ఎలాంటి గాయాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.ఈ వీడియోను చూసినవారు అంతా షాక్ అవుతున్నారు.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మే 3వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్, అనేక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు.
గురువారం ఉదయం న్యూ సౌత్ వేల్స్‌లో( New South Wales ) జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా అక్కడకు హాజరయ్యారు.
అందరూ స్టేజీపై నిల్చుని సందడి చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఆ తరువాత అందరూ కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.చాలామంది వీడియో చూసి వీడియో చాలా ఫన్నీగా ఉందని కొందరు పేర్కొనగా.ఈ ఘటన మొత్తం సరదాగా ఉండడంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కు విమర్శలు కూడా వస్తున్నాయి.ఈ ఘటనతో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ, వీడియో సోషల్ మీడియా లో పెద్ద చర్చను రేపింది.