పాదాలు నల్లగా అసహ్యంగా మారాయా.. పసుపుతో ఇలా చేశారంటే పది నిమిషాల్లో వైట్ గా మారతాయి!

బయటకు బహిర్గతం అయ్యే మన శరీర భాగాల్లో పాదాలు ఒకటి.అందువల్ల పాదాలు( feet ) తెల్లగా మృదువుగా మెరిసిపోతూ కనిపించాలని మగువలు ఆరాటపడుతుంటారు.

 This Home Remedy Helps To Lighten Your Dark Feet! Dark Feet, Feet Whitening Reme-TeluguStop.com

కానీ ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు, అధిక వేడి కారణంగా పాదాలు టాన్ అయిపోతాయి.నల్లగా అసహ్యంగా మారతాయి.

దాంతో నల్లగా మారిన పాదాలను చూసి వర్రీ అయిపోతుంటారు.పాదాలను మళ్లీ ఎలా తెల్లగా మార్చుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా పాదాలను తెల్లగా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.నిత్యం వంటల్లో విరివిరిగా వాడే మ‌సాలాల్లో ప‌సుపు ముందు వ‌రుస‌లో ఉంటుంది.పసుపు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి పసుపు ఉపయోగపడుతుంది.న‌ల్ల‌గా మారిన పాదాల‌ను రిపేర్ చేయ‌డానికి కూడా ప‌సుపు తోడ్ప‌డుతుంది.

Telugu Tips, Feet, Feet Remedy, Remedy, Skin Care, Skin Care Tips, Remedyhelps-T

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు పసుపు( Turmaric ) వేసి పూర్తిగా నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.ఇప్పుడు ఈ పసుపులో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( lemon juice ) వేసుకుని కలుపుకోవాలి.చివరిగా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకొని అన్నీ కలిసేలా మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు పూతలా అప్లై చేసుకుని 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై అర నిమ్మ చెక్కను తీసుకుని పాదాలను బాగా రుద్దుకోవాలి.

Telugu Tips, Feet, Feet Remedy, Remedy, Skin Care, Skin Care Tips, Remedyhelps-T

ఫైనల్ గా గోరు వెచ్చని నీటితో పాదాలను వాష్ చేసుకుని తడిలేకుండా తుడిచి మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల పాదాలపై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.

నల్లగా అసహ్యంగా మారిన పాదాలు వైట్ గా మరియు స్మూత్ గా మారతాయి.అందంగా మెరుస్తాయి.

కాబట్టి పాదాలు నల్లగా మారాయని బాధపడుతున్న వారు తప్పకుండా పసుపుతో ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్‌ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube