న్యూస్ రౌండప్ టాప్ 20

1.వరద బాధితులకు హీరో సూర్య కార్తీ సహాయం

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తం అయింది.భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకోవడంతో బాధితులకు సహాయం అందించేందుకు సినీ హీరో సూర్య,  ఆయన తమ్ముడు హీరో కార్తీ ముందుకు వచ్చారు.ఈ మేరకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Ap Cm Jagan-TeluguStop.com

2.సిపిఐ నారాయణ కామెంట్స్

ఐదు రాష్ట్రాల ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

3.ఎంపీ పదవికి ఉత్తంకుమార్ రెడ్డి రాజీనామా

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ పదవి రాజీనామా చేయనున్నారు.హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేస్తున్నారు.

4.తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్

తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది .అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమలు కాగా , దాదాపు రెండు నెలల పాటు కోడ్ అమలులో ఉంది.

5.ఢిల్లీకి చంద్రబాబు

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 7 న ఢిల్లీకి వెళ్ళనున్నారు .ఏపీలో ఓట్ల అక్రమాలపై సిఈసి కి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.

6 చంద్రబాబుపై సిఐడి పిటి వారెంట్లు .తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

టిడిపి అధినేత చంద్రబాబుపై సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

7.తుఫాను ఎఫెక్ట్ గన్నవరం నుంచి విమానాలు రద్దు

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

ఏపీ లో తుఫాన్ నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశారు.

8.నాగార్జునసాగర్ పై కేంద్రం సమావేశం

నాగార్జునసాగర్ పై ఈనెల 8న కేంద్రం సమావేశం జరుగునుంది.తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

9.రేవంత్ సీఎం అభ్యర్థిత్వం పై కీలక వ్యాఖ్యలు

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

తెలంగాణ సీఎం ఎంపికపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన అనుచరుల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారట.రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు శివకుమార్ వెల్లడించినట్లు సమాచారం.

10.విశాఖ విమానాశ్రయం మూసివేత

తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో విశాఖ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.  విశాఖ నుంచి నడవాల్సిన 23 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ వెల్లడించారు.

11.అన్న ప్రసాదం నాణ్యత లోపంపై టీటీడీ చైర్మన్ క్లారిటీ

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

తిరుమలలోని వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్న ప్రసాదం నాణ్యత లోపంపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.కొంతమంది భక్తులు అన్న ప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందని దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

12.తిరుమలలో భక్తుల నిరసన

తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో భక్తులు నిరసనకు దిగారు.  టీటీడీ భక్తులకు వడ్డించిన అన్నం బాగాలేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

13.ఏపీలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

ఏపీలో మే చాంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది.తుఫాను ప్రభావంతో ఏపీలో 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

14.నేడు జనగామ జిల్లాకు కేటీఆర్

టిఆర్ఎస్ నేత కేటీఆర్ జనగామ కు రానున్నారు.  చెల్పూర్ మండలం రాజవరంలో జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి అంత్యక్రియల్లో కేటీఆర్ పాల్గొంటారు.

15.సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో  ఈనెల 27న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

16.రైతుబంధు వెంటనే విడుదల చేయాలి

తెలంగాణలో యాసంగి పంటకు సిద్ధమైన రైతులకు రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

17.గురువారం వరకు ఎస్ఎస్సి పరీక్ష ఫీజు గడువు

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

ఎస్ఎస్సి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు డిసెంబర్ 7 వరకు అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ప్రకటన విడుదల చేశారు.

18.మూడవ శాసనసభకు గవర్నర్ ఆమోదం

తెలంగాణలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆమోదించారు.

19.లోక్సభలో తెలంగాణ సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లు

Telugu Ap Cm Jagan, Ap, Brs, Chandrababu, Congress, Cpi Yana, Suriya, Revanth Re

తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభ లో ప్రవేశపెట్టారు.

20.తుఫాను పై సీఎం జగన్ సమీక్ష

ఏపీలో తుఫాను ప్రభావం ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు .తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఎక్కడా ప్రాణా నష్టం లేకుండా చూడాలని , లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు .యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనుల కోసం జిల్లాకు రెండు కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube