ప్రస్తుత సమాజంలో జీవించాలంటే డబ్బు( Money ) కచ్చితంగా కావాల్సిందే.డబ్బు మూలం ఇదం జగత్ అనే పెద్దలు ఊరికే అనలేదు.
అలాంటి ఈ తరుణంలో ప్రజలంతా తమకు తెలియకుండానే ధనకాంక్షతో మంచి చెడు అన్ని మర్చిపోతూ ఉంటారు.ధనవంతులు కావాలన్న ఆరాటంతో తెగ పూజలు, వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు.
అవన్నీ చూసి లక్ష్మీదేవి( Lakshmi Devi ) మందహాసంతో ఏమంటుందో వింటే ఖంగు తినడం ఖాయం అని పండితులు చెబుతున్నారు.మన పూజలు కాదనలేక ఆమె వస్తుందట, కానీ ఆ మాయలో పడి మనం ఏమవుతున్నావో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ మానవులారా! మీరంతా నన్ను ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.నన్ను మీ ఇంటికి రమ్మని ధనరాశులతో సిరులపంట పండించమని వేడుకుంటూ ఉంటారు.మీ ప్రార్ధన కాదనలేక( Prayer ) నేను మీ ఇళ్లకు వస్తూ మిమ్మల్ని భాగ్యవంతులుగా మారుస్తున్నాను.మీకు విలాసవంతమైన ఇల్లు, కార్లు, తోటలు మొదలైన సమస్త సౌకర్యాలు సమకూరుస్తున్నాను.
ఆ తర్వాత మీరు చేసే పనులే నాకు నచ్చటం లేదు.నన్ను మీ ఇనపెట్టాలో, బ్యాంకు లాకర్లలో బంగారం రూపంలో బంధించాలని ప్రయత్నిస్తున్నారు.
ఎప్పుడూ నన్ను మీ బందిగా ఉంచుకొని నా ద్వారా స్వర్గసుఖాలు అనుభవించాలని పథకాలు వేస్తున్నారు.
కానీ నా అసలు స్వరూపం మీకు తెలియదు.మీ నిజ స్వరూపం కూడా మీకు తెలియదని నేను భావిస్తున్నాను.మీరు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఒక పైస కూడా తీసుకురారు.
తిరిగి భూమి గర్భంలోకి వెళ్లే మరణ యాత్రలో( Death ) కూడా ఒక పైస కూడా తీసుకుపోలేరు.రోజు మీ కళ్ళ ముందు చనిపోయే వారిలో కోటీశ్వరులు, జమీందారులను చూస్తూ ఉంటారు.
రేపు మన దుస్థితి కూడా అంతే కదా అనే అసలు నిజం తెలుసుకోలేకపోతున్నారు.
మీ ఆశలకు, కోరికలకు హద్దు లేకుండా పోతూ ఉంది.ఇది మీరు తెలుసుకోలేని మీ నిజ స్వరూపం.ఇక నా స్వరూపం గురించి చెబుతాను నేను ఎవరి దగ్గర నిలకడగా ఉండను.
తమ అవసరాలకు మించి ఉన్న ధనాన్ని పుణ్యకార్యాలకు, దైవ కార్యాలకు, పేద వారి ప్రయోజనాలకు ఉపయోగిస్తూ ఉన్న వారిని మరింత కుబేరులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ, వారి వద్దనే నేను శాశ్వతంగా ఉండిపోతాను అని లక్ష్మీదేవి చెబుతూ ఉంది.
DEVOTIONAL