యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్( Salaar )’ చిత్రం కోసం ఇప్పుడు ఇండియా మొత్తం మూవీ లవర్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం.కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ వంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ చిత్రం పై ప్రారంభ రోజు నుండే వేరే లెవెల్ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ పోవడమే తప్ప తగ్గడం లేదు.సెప్టెంబర్ 28 వ తారీఖున రావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 22 కు వాయిదా పడింది.
ఈ వాయిదా ప్రభావం సినిమా మీద ఏమైనా పడుతుందా అని అనుకున్నారు.కానీ ఇసుమంత ప్రభావం కూడా పడలేదు, ఓవర్సీస్ బుకింగ్స్ అప్పుడే మూడు లక్షల డాలర్లకు రీచ్ అయ్యింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామి ని పసిగట్టి ముందు కానీ , వెనుక కానీ తమ సినిమాలను విడుదల చేసుకునే సాహసం చెయ్యట్లేదు మేకర్స్.

షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా ఈ సినిమా తో క్లాష్ ఎందుకు అని ఒక రోజు ముందుకు జరిగాడు.అలాంటి వాతావరణం ఉన్న ఈ నేపథ్యం లో సలార్ కి ఛాలెంజ్ విసురుతూ కళ్యాణ్ రామ్ తన ‘డెవిల్‘ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సిద్ద పడుతున్నారు.ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ స్వయంగా తెలిపాడు.
డిసెంబర్ 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టుగా ఆయన చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం రప్పించింది.సలార్ ఫీవర్ కి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా బయపడి వెనక్కి వెళ్తుంటే, అలాంటి సందర్భం లో నువ్వు వస్తావా?, మా థియేటర్స్ ని తగ్గించడానికి కాకపోతే ఇలాంటి వాతావరణం లో వచ్చి బ్రేక్ ఈవెన్ కొట్టగలవా అని ప్రభాస్ ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ ని నిలదీస్తున్నారు.

సంక్రాంతికి విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‘ తప్పుకుంది , ఆ స్లాట్ లో మీ సినిమాని విడుదల చేసువచు కదా, ఎందుకు మాకు అడ్డు వస్తున్నారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )ని ప్రశ్నిస్తున్నారు.కావాలని ఉద్దేశపూర్వకంగానే మనసులో ఎదో పెట్టుకొని ఈ సినిమాని విడుదల చేస్తున్నారని , ఇది మా మనసులో పెట్టుకుంటాము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నారు.ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, అభిషేక్ నామ దర్శకత్వం వహించాడు.