ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై కన్నీరు పెట్టుకున్న రేవంత్ రెడ్డి..!!

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్( KCR ) నుండి రేవంత్ రెడ్డి పాతిక కోట్లు తీసుకున్నట్లు బీజేపీ పార్టీ నేత ఈటల రాజేందర్ సంచలన చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.దీంతో తనపై ఈటెల రాజేందర్( Etela Rajender ) చేసిన ఆరోపణలు రుజువు చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 Revanth Reddy Shed Tears On Etela Rajender's Comments, Brs, Bjp, Revanth Reddy,-TeluguStop.com

కేసిఆర్ తో లాలూచీ తన రక్తంలోనే లేదని స్పష్టం చేశారు.కేసిఆర్, కేటీఆర్ అవినీతిపై పోరాటం చేసింది తానే అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో చర్లపల్లి జైలులో నిర్బంధించిన భయపడలేదని చెప్పుకొచ్చారు.

కేసిఆర్ తో కోట్లాడుతున్న తమపై నిందలా.? నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు.నా కళ్ళల్లో నుండి నీళ్లు రప్పించావు ఈటెల అంటూ తాజాగా రేవంత్ రెడ్డి( Revanth Reddy )కన్నీరు పెట్టుకున్నారు.

అంతకుముందు ఇదే విషయంపై… చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.మునుగోడు ఉప ఎన్నిక( Munugodu By Election ) కోసం… BRS, BJP పార్టీల నుంచి ఎలాంటి డబ్బు స్వీకరించలేదని చెప్పుకొచ్చారు.

తాను BRS నుంచి ₹25 కోట్లు తీసుకున్నట్లు ఈటెల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.అంతేకాదు నిజాయితీగా పనిచేసే స్రవంతిని అభ్యర్థిగా బరిలో నిలిపి ఒక్క నోటు ఇవ్వకుండా ఆ ఉప ఎన్నికలలో ఓటు అడిగినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube