ఆ ప్రముఖ దర్శకుడి ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. ఈ నటి భారీ షాకిచ్చిందిగా!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన ప్రేమ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.పలానా హీరోయిన్ పలానా హీరోతో పలానా డైరెక్టర్ తో ప్రేమలో ఉంది అంటూ అనేక రకాల గాసిపులు వినిపిస్తూనే ఉంటాయి.

 Ammu Abhirami Love Director Parthiv Mani, Ammu Abhi Rami, Parthiv Mani, Love, Po-TeluguStop.com

తాజాగా కూడా యంగ్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టింది.కానీ సదరు హీరోయిన్ పరోక్షంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది.

అయితే కుర్రాడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే కావడం ఇక్కడ ఆసక్తికర విషయం.

తాజాగా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఏకంగా వీడియో పోస్ట్ చేయడంతో హీరోయిన్ ప్రేమ కహానీపై క్లారిటీ వచ్చేసింది.చెన్నైకి చెందిన అమ్ము అభిరామి..2017 నుంచి ఇండస్ట్రీలో ఉంది.దళపతి భైరవ మూవీతో నటిగా మారింది.

కాకపోతే తమిళ సూపర్ హిట్ సినిమా రాక్షసుడు సినిమా( Rakshasudu )లో స్కూల్ స్టూడెంట్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో కూడా నారప్ప, ఎఫ్‌సీయూకే, రణస్థలి, డెవిల్ సినిమాలలో నటించింది.

ఒక వైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు సహాయ పాత్రల్లోనూ నటిస్తోంది.ఇకపోత అభిరామి ప్రేమ విషయానికొస్తే.

తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ కుక్ విత్ కోమలి అనే వంటల ప్రోగ్రామ్‌లోనూ చేసింది.ఈ షోకి పనిచేస్తున్న డైరెక్టర్ పార్థివ్ మణి( Parthiv mani )తో అలా ప్రేమలో పడింది.గతంలో ఓసారి ప్రేమ విషయాన్ని చూచాయిగా బయటపెట్టింది.కానీ ఇప్పుడు అతడి పుట్టినరోజున వీడియో పోస్ట్ చేసి.నా జీవితంలో వచ్చినందుకు థ్యాంక్స్ అని రాసుకొచ్చింది.ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో చెప్పబోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube