అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )తన మంత్రివర్గంలో పలువురు భారత సంతతి నేతలకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ఇండో అమెరికన్ చేరాడు.
ట్రంప్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన మాజీ జర్నలిస్ట్ కేష్ దేశాయ్‌ను ( journalist Kesh Desai )నియమించినట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.దేశాయ్ గతంలో 2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా , రిపబ్లికన్ పార్టీ ఆఫ్ అయోవాకు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు.

దేశాయ్ రిపబ్లికన్ నేషనల్ కమిటీలో డిప్యూటీ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్, పెన్సిల్వేనియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గానూ( Pennsylvania Communications ) పనిచేశారు.ఈ హోదాలో పెన్సిల్వేనియా వంటి కీలకమైన రాష్ట్రంలో ట్రంప్ సందేశాలు జనంలోకి వెళ్లేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఏడు కీలకమైన రాష్ట్రాల్లోనూ ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే.కాగా.వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌ను డిప్యూటీ వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ టేలర్ బుడోవిచ్ ( Cabinet Secretary Taylor Budovich )పర్యవేక్షిస్తారు.ట్రంప్ గతంలోనే.
వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా స్టీవెన్ చియుంగ్, ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లివిట్‌లను నియమించారు.

ఇకపోతే.ట్రంప్ కొద్దిరోజుల క్రితం కీలకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా జై భట్టాచార్యను నియమించారు .అలాగే హర్మీద్ కే ధిల్లాన్‌ను న్యాయశాఖలో పౌరహక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేశారు.బిలియనీర్ వివేక్ రామస్వామిని ప్రభుత్వ సమర్ధత విభాగానికి (DOGE) సహ అధిపతిగా నియమించగా.ఇటీవలే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు.త్వరలోనే ఒహియో రాష్ట్ర గవర్నర్‌గా వివేక్ రామస్వామి బరిలో నిలుస్తారని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.రానున్న రోజుల్లో ఇంకేంత మంది భారత సంతతి నేతలకు ట్రంప్ తన జట్టులో చోటు కల్పిస్తారో చూడాలి.