వైరల్.. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. బ్యాంకు డిపాజిట్ స్లిప్ పై ఏకంగా?

చాలా మంది తమ బ్యాంక్ లావాదేవీల కోసం బ్యాంకులకు లేదా ఏటీఎంలకు వెళ్తుంటారు.ముఖ్యంగా, డబ్బు విత్‌డ్రా చేయడం లేదా డిపాజిట్ చేయడం వారి ప్రధాన పని.

 How Can Viral Ideas Come Together On A Bank Deposit Slip, Bank Deposit Slip, Vir-TeluguStop.com

అయితే, కొన్నిసార్లు బ్యాంకుల్లో ఆసక్తికర సంఘటనలు జరగడం సహజం.అలాంటి ఓ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank of India ) (ఎస్‌బీఐ)లో ఓ మహిళ డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు డిపాజిట్ స్లిప్‌ను విచిత్రంగా పూర్తి చేసింది.

Telugu Bank Manager, Humor, Creativedeposit, Bank Story, Ideasbank, Indian, Tren

డిపాజిట్ స్లిప్‌లో ఆమె పేరు రాధికా శర్మగా ( Radhika Sharma )ఉంది.అయితే, డిపాజిట్ స్లిప్‌లో డబ్బు వివరాలు రాయాల్సిన చోట, తన భర్తతో కలిసి జాతరకు వెళ్లాలని రాసింది.ఆ స్లిప్‌లో మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే, “రాశి” అనే చోట “కుంభరాశి” అని రాసింది.

అంతేకాదు, డబ్బు మొత్తం రాయాల్సిన స్థానంలో “కుంభమేళా”( Kumbh Mela ) అని పేర్కొంది.ఇందుకు సంబంధించిన స్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.

Telugu Bank Manager, Humor, Creativedeposit, Bank Story, Ideasbank, Indian, Tren

ఈ ఫోటో పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.ఈ ఆసక్తికరమైన డిపాజిట్ స్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.ఇప్పటివరకు దీనికి పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి.అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఫన్నీ కామెంట్స్‌తో స్పందించారు.ఈమెను ప్రయాణం చేయకుండా ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదంటూ కామన్స్ రాగా., మరికొందరు R అక్షరం ఉన్న వ్యక్తులు కుంభ రాశిని కలిగి ఉండరని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సంఘటన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.మహిళ సృజనాత్మకత ఒక్క బ్యాంక్ మేనేజర్‌ను కాకుండా, లక్షలాది మంది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

ఇకపోతే మీరెప్పుడైనా బ్యాంకులో ఇలాంటి ఆసక్తికర సంఘటనలను చూశారా? అలాంటివి ఏవైనా ఉంటే మీ అనుభవాలను మాతో పంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube