తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికి దిల్ రాజుకి( Dil raju ) ఉన్న గుర్తింపు వేరే లెవల్ అనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా యూత్ లో కూడా మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయనే చెప్పాలి.
ఆయన చేసిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాకుండా అందులో కొన్ని క్లాసిక్ సినిమాలు కూడా ఉండడం విశేషం.
ముఖ్యంగా బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి లాంటి సినిమాలు యావత్ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా దిల్ రాజు బ్యానర్( Dil Raju banner ) ని చాలా వరకు ముందుకు తీసుకెళ్లాయనే చెప్పాలి.మరి ఇలాంటి సినిమాలతో ఆయన స్టార్ డైరెక్టర్ గా మారడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడం విశేషం… మరి ఏది ఏమైనా రాబోయే సినిమాలతో కూడా ఆయన తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.మరి దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలను రూపొందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇలా ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు డల్ అయినప్పటికి ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకొని గేమ్ చేంజర్ లో వచ్చిన నష్టాన్ని ఈ సినిమాతో కవర్ చేస్తున్నాడనే చెప్పాలి.
ఇక ఇప్పుడు తన బ్యానర్ నుంచి ఈ సంవత్సరంలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.వీటన్నింటితో సూపర్ సక్సెస్ ని అందుకొని తన లాంటి ప్రొడ్యూసర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరనేంత గొప్పగా చాటి చెప్పాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే 50 సినిమాలకు పైన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దిల్ రాజు మరిన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేసి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
.