వైరల్ వీడియో: నన్నే టోల్ ఫీ అడుగుతావా.. బుల్డోజర్ తో ఏకంగా..

ఈ మధ్యకాలంలో తరచుగా అనేక రకాల దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యం లోని తాజాగా మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Uttar Pradesh Bulldozer Demolished Hapur Toll Plaza On Asking Toll Tax Viral Vid-TeluguStop.com

ఉత్తరప్రదేశ్‌ లోని( Uttar Pradesh ) హాపూర్‌ లో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది.టోల్‌ చార్జీలు( Toll Charge ) పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్‌ తో( Bull Dozer ) టోల్‌ బూత్‌ ను ధ్వంసం చేశాడు.

ఈ ఘటన ప్రస్తుత దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ సంఘటన ఢిల్లీ లక్నో జాతీయ రహదారి హాపూర్‌ లోని( Hapur ) టోల్ బూత్ వద్ద మంగళవారం ఉదయం పూట చోటు చేసుకుంది.టోల్ ఎగ్జిట్ దగ్గర బుల్డోజర్ ఇనుప స్తంభాలను ఢీకొట్టడాన్ని అక్కడే పని చేస్తున్న టోల్ కార్మికులు వీడియో తీశారు.టోల్‌ విషయంలో సిబ్బంది, బుల్డోజర్‌ డ్రైవర్‌ మధ్య వాగ్వాదం జరగగా.

, ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆ బుల్డోజర్‌ డ్రైవర్‌ టోల్‌ బూత్‌ ను( Toll Booth ) ఒక్కసారిగా ఎంత చెప్పినా వినకుండా ధ్వంసం చేశాడు.అనంతరం అక్కడి నుంచి తన వాహనాన్ని తీసుకొని వెళ్లిపోయాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇక ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ దాడికి పాల్పడిన బుల్డోజర్‌ డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.అచ్చం ఇలాగే గతవారం కూడా మరో ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇదే హాపూర్‌ లో ఓ కారు డ్రైవర్‌ టోల్‌ ట్యాక్స్‌ ను కట్టకుండా ఉండేందుకు ఏకంగా టోల్‌ సిబ్బంది పైకే కారును ఎక్కించాడు.ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube