వైరల్ వీడియో: నన్నే టోల్ ఫీ అడుగుతావా.. బుల్డోజర్ తో ఏకంగా..

ఈ మధ్యకాలంలో తరచుగా అనేక రకాల దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యం లోని తాజాగా మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఉత్తరప్రదేశ్‌ లోని( Uttar Pradesh ) హాపూర్‌ లో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది.

టోల్‌ చార్జీలు( Toll Charge ) పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్‌ తో( Bull Dozer ) టోల్‌ బూత్‌ ను ధ్వంసం చేశాడు.

ఈ ఘటన ప్రస్తుత దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. """/" / ఈ సంఘటన ఢిల్లీ లక్నో జాతీయ రహదారి హాపూర్‌ లోని( Hapur ) టోల్ బూత్ వద్ద మంగళవారం ఉదయం పూట చోటు చేసుకుంది.

టోల్ ఎగ్జిట్ దగ్గర బుల్డోజర్ ఇనుప స్తంభాలను ఢీకొట్టడాన్ని అక్కడే పని చేస్తున్న టోల్ కార్మికులు వీడియో తీశారు.

టోల్‌ విషయంలో సిబ్బంది, బుల్డోజర్‌ డ్రైవర్‌ మధ్య వాగ్వాదం జరగగా., ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆ బుల్డోజర్‌ డ్రైవర్‌ టోల్‌ బూత్‌ ను( Toll Booth ) ఒక్కసారిగా ఎంత చెప్పినా వినకుండా ధ్వంసం చేశాడు.

అనంతరం అక్కడి నుంచి తన వాహనాన్ని తీసుకొని వెళ్లిపోయాడు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

"""/" / ఇక ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ దాడికి పాల్పడిన బుల్డోజర్‌ డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.అచ్చం ఇలాగే గతవారం కూడా మరో ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇదే హాపూర్‌ లో ఓ కారు డ్రైవర్‌ టోల్‌ ట్యాక్స్‌ ను కట్టకుండా ఉండేందుకు ఏకంగా టోల్‌ సిబ్బంది పైకే కారును ఎక్కించాడు.

ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తండేల్ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారా..?