కోలీవుడ్ నటుడు విశాల్( Actor Vishal ) కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.అయితే విశాల్ కొంతకాలం క్రితం బలహీనంగా కనిపించడం గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఈ వార్తల గురించి ఇష్టానుసారం ప్రచారం చేయడం గమనార్హం.తమిళ యూట్యూబర్ సెగురా ( Tamil YouTuber Segura )విశాల్ ఆరోగ్యం గురించి ఇష్టానుసారం వార్తలు ప్రచారం చేసిన నేపథ్యంలో నాజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం.ప్రస్తుతం విశాల్ నటించిన మదగదరాజా ( Madagadaraja )థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.సినిమా రిలీజ్ సమయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న విశాల్ అస్వస్థతకు గురి కాగా ఈ ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు.103 డిగ్రీల జ్వరం వల్ల ఆయన వేదికపై వణుకుతూ మాట్లాడారు.

ఆ సమయంలో విశాల్ డెంగీ ఫీవర్ తో బాధ పడుతున్నారని ఆ తర్వాత టీమ్ నుంచి స్పష్టత వచ్చింది.విశాల్ మద్యానికి బానిస కావడం వల్ల బలహీనతకు గురయ్యాడని ఆయన చేతులు, కాళ్లలో వణుకు రావడం వెనుక బలమైన జబ్బు ఉందని త్వరలో ఆయన మరింత బలహీనపడతారని భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీకి విశాల్ దూరం కావచ్చని ఆయనతో నటించేందుకు ఎవరూ ఇష్టపడరని యూట్యూబర్ సెగురా కామెంట్లు చేశారు.

మదగదరాజ మూవీ కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచింది.బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను సాధించింది.తెలుగు రాష్ట్రాల్లో జనవరి 31వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఇక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.సెగురాను కఠినంగా శిక్షించాలని విశాల్ అభిమానులు సైతం కోరుకుంటున్నారు.







